Homeస్పెషల్ స్టోరీప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్‌ సిద్దమైన బీఆర్‌ఎస్- హాట్ హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్‌ సిద్దమైన బీఆర్‌ఎస్- హాట్ హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు


Telangana Assembly Sessions 2024: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 9న ప్రారంభమయ్యాయి. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ప్రకటన చేసిన తర్వాత సమావేశాలు వాయిదా పడ్డాయి. ఇన్ని రోజుల వాయిదా తర్వాత ఇవాళ ఫునఃప్రారంభమయ్యాయి. ప్రారంభమైన క్షణం నుంచే సభ హాట్‌ హాట్ మారిపోయింది. అధికార విపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇటు అసెంబ్లీ, అటు మండలిలో పోటాపోటీగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. 

అప్పులపై తప్పుడు సమాచారం; బీఆర్‌ఎస్

రాష్ట్రంలోని అప్పులు ఆదాయాలపై ప్రభుత్వం తప్పుడు సమాచారం ప్రజలకు చేర వేస్తోందని ఆరోపించిన బీఆర్‌ఎస్‌ ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెట్టేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ అనుమతి కోరారు బిఅర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ శాసనసభ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం నోటీసు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. 

ఆర్బీఐ నివేదికను చూపిస్తున్న బీఆర్‌ఎస్

తెలంగాణలో అప్పులపైన సభను, ప్రజలను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వంపైన ప్రివిలేజ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అర్‌బిఅర్ఐ నివేధికలో తెలంగాణ అప్పులు కేవలం 3.89 లక్షల కోట్లు అని చెప్పిన ప్రభుత్వం మాత్రం 7 లక్షల కోట్లు అంటోందని ఆరోపించారు. ఇది ప్రజలను, సభను మోసం చేయడమేనంటూ బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. అప్పులపై ఆర్ధికమంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవం అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చిందన్నారు. ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ పేరుతో రిలీజ్ చేసిన నివేదికలో ఇది స్పష్టంగా ఉందన్నారు. 

బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చెడ్డపేరు

2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72 వేల 658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల రూ. 3,89, 673 కోట్లకు చేరినట్టు ఆర్బీఐ పేర్కొందన్నారు. దీనిపై ఆర్ధిక మంత్రి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడింది.  దీని వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించిందని నోటీసులో పేర్కొన్నారు. అందుకే తెలంగాణ శాసనసభ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం బీఆర్‌ఎస్‌ఎల్పీ తరఫున ఆర్ధిక మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నామన్నారు. 

సర్పంచ్‌లకు ఇవ్వాల్సిన బిల్లులపై వాగ్వాదం 

అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నోత్తరాల సమయంలో సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులపై సభ దద్దరిల్లింది. పెండింగ్ బిల్లులు ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. 690 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి సీతక్క చెప్పడంపై మండిపడ్డారు. బడాబడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నా ప్రభుత్వం సర్పంచులకు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. 

ఏడాది కాలం నుంచి రూ.690 కోట్లు ఇవ్వకుండా సర్పంచులు, ఎంపీటీసీలను తిప్పించుకుంటున్నారని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌, మంత్రులను, ఎందర్ని కలిసి మొర పెట్టుకున్నా పట్టించుకున్న వాళ్లే లేరని గట్టిగా నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని అన్నారు. పల్లెలను కెసిఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని.. గొప్ప కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు. పల్లె ప్రగతికి నెల 275 కోట్లు, పట్టణ ప్రగతికి 150 కోట్లు ఇచ్చామన్నారు. 

బీఆర్‌ఎస్‌ హయాంలో పల్లె ప్రగతి : హరీష్

కేంద్ర ప్రభుత్వ చెబుతున్న లెక్కలు, దేశవ్యాప్తంగా ఉత్తమ గ్రామపంచాయతీలు ప్రకటిస్తే 20కిగాను 19 తెలంగాణ గ్రామాలకు వచ్చాయని గుర్తు చేశారు హరీష్‌. తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కెసిఅర్, బి ఆర్ ఎస్ దేనన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదన్నారు హరీష్‌. SFC నిధులు విడుదల కావడం లేదు, 15 ఫైనాన్స్ కమిషన్ బిల్లులు డైవర్ట్ చేశారని ఆరోపించారు. జిపి ఫండ్ కూడా ఖర్చు పెట్టుకోకుండా చేశారని ధ్వజమెత్తారు. 

బిల్లులు చెల్లించకుండా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు హరీష్‌. అప్పులు చేసి, బంగారం కుదువపెట్టి గ్రామ పంచాయతీ పనులు చేశారని వాటిని కూడా ఇవ్వలేదన్నారు. నవంబర్ నెలలోనే బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్లు విడుదల చేశారని తెలిపారు. చిన్న పనులు చేసిన సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసిలకు బిల్లులు విడుదల చేయకుండా పగ బట్టారన్నారు. కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రోగాల మయంగా పల్లెల్లు: హరీష్‌రావు

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయక పోవడం వల్ల రోగాలు పెరిగాయన్న హరీష్‌… తెలంగాణ వెళ్తే జాగ్రత్త అంటూ అమెరికా హెచ్చరించిందని గుర్తు చేశారు. ఇది దేశానికి, తెలంగాణకు అవమానకరమన్నారు. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం పూర్తై 9 నెలలు అయినా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వరు, జీతాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టమైన తేదీ చెప్పాలని డిమాండ్ చేశారు. 

హరీష్‌ కామెంట్స్‌పై శ్రీధర్‌బాబు ఫైర్

పల్లె ప్రగతి పేరుతో 270 కోట్లు విడుదల చేశామని హరీష్ చెప్పడం పచ్చి అబద్దమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అసలు ఇంతలా బకాయిలు పెరిగిపోవడానికి గత సర్కారు నిర్వాకమే కారణమని అన్నారు. 270 కోట్లు విడుదల చేసినట్టు అయితే ఇంత పెండింగ్ బిల్లులు ఎందుకు బకాయిలుగా ఉన్నాయో బీఆర్‌ఎస్ నాయకులే చెప్పాలని సవాల్ చేశారు. 

Also Read: ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కారిడార్ ప్రతిపాదన విరమించుకోవాలి – ఎమ్మెల్యే హరీష్ బాబు

2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. సర్పంచ్‌ల పదవీ కాలం 2024 ఫిబ్రవరితో ముగిసిందన్నారు. మరి ఇంత బకాయిలు ఎవరి హయాంలో పెట్టినవో హరీష్ చెప్పాలని ప్రశ్నించారు. వారి హయాంలోనే సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. బీఆర్‌ఎస్ చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సరి చేసుకొని వస్తున్నామని… త్వరలోనే పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 

మండలిలో బీసీ సంక్షేమ లడాయి

శాసనసభలో సర్పంచ్‌లకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు దుమారం రేపితే… శాసనమండలిలో బీసీ సంక్షేమం హాట్ టాపిక్ అయింది. బీసీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయడం లేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ 275 బిసి పాఠశాలలు, 31 డిగ్రీ బిసి కళాశాలలు ఏర్పాటు చేసిందన్నారు. అగ్రికల్చర్ బిసి కళాశాల ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. 14 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చేసిందని తెలిపారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క బిసి గురుకులాలు ఏర్పాటు చేయలేదని వాపోయారు. 

బీసీ పాఠశాలలు ఏర్పాటు చేయకపోగా… విదేశీ విద్యకు సంబంధించి ఎలాంటి ప్రోత్సహకాలు లేవన్నారు కవిత. ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు. గురుకులాల్లో మెనూ మార్చామని ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఇంకా అది స్కూల్స్‌లో ప్రారంభం కాలేదన్నారు. నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి నవోదయా విద్యాలయాలను ఎన్ని సాధించారనో చెప్పాలన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఏమైనా సాధించారా అని ప్రశ్నించారు. 

బీసీ సంక్షేమంపై చర్చకు సిద్ధమన్న పొన్నం ప్రభాకర్

కవిత విమర్శలపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీలపై పదేళ్లలో చేసిన ఖర్చుపై సిద్ధమా అని సవాల్ చేశారు. పదేళ్లలో బీసీలకు కేసీఆర్ ప్రభుత్వం కేవలం 8వేల కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. అందులో రెండు వేల కోట్లు మాత్రమే విడుదల చేసిందని వివరించారు. అందులో కూడా కేవలం 800 కోట్లే ఖర్చు చేశారని సభ ముందు ఉంచారు. తాము బీసీ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నామని కచ్చితంగా 42 కుల భవనాలను నిర్మించి తీరుతామన్నారు. అందు కోసమే కుల గణన చేస్తున్నట్టు తెలిపారు. వాటికి అనుగుణంగానే రిజర్వేషన్లు ఇతర ప్రయోజనాలు కల్పిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 

Also Read: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments