American Consulate General meeting with Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అమెరికానల్ కాన్సులేట్ జనరల్ మర్యాదపూర్వకంగా కలిశారు. అమెరికా అభివృద్ధిలో తెలుగు ప్రజల పాత్ర, సులభతరమైన వీసా విధానం, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ఈ సమావేశంలో చర్చించారని జనసేన పార్టీ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా కలిసిన యుఎస్ కాన్సులేట్ జనరల్
అమెరికా అభివృద్ధిలో తెలుగు ప్రజల పాత్ర, సులభతరమైన వీసా విధానం, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ఈ సమావేశంలో చర్చించారు.@USCGHyderabad@USAndHyderabad pic.twitter.com/LqRO9MvKoA
— JanaSena Party (@JanaSenaParty) July 30, 2024
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని పవన్ కల్యాణ్ యూఎస్ కాన్సుల్ జనరల్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని తెలిపారు. వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్ళేవారికీ తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని వారిని పవన్ కళ్యాణ్ కోరినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు వారు సానుకూలంగా స్పందించారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారితో యూ.ఎస్. కాన్సల్ జనరల్ భేటీ@USAndHyderabad pic.twitter.com/9El6WJwkhv
— JanaSena Party (@JanaSenaParty) July 30, 2024
ఈ సమావేశంలో యూ.ఎస్. కాన్సల్ పొలిటికల్, ఎకనామిక్స్ విభాగం చీఫ్ ఫ్రాంక్ టాలుటో, ఆ విభాగం ప్రతినిధులు శ్రీమాలి కారే, సిబప్రసాద్ త్రిపాఠి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ టీమ్‌ను సత్కరించారు పవన్. పవన్‌కు అభినందనలు తెలియచేసి.. జ్ఞాపిక అందచేశారు యూఎస్ కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ .
ఏదైనా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే.. ఆ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల్ని వివిద దేశాల కాన్సులేట్ జనరల్ ఉన్నతాధికారులు కలుస్తూ ఉంటారు. ఈ క్రమంలో గతంలో పలువురు ఇతర దేశాల కాన్సుల్ జనరళ్లు కూడా పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
మరిన్ని చూడండి