Homeస్పెషల్ స్టోరీనేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?

నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?


One Nation One Election Parliament: వన్ నేషన్, వన్ ఎలక్షన్ అని గట్టిగా పట్టుబట్టిన ఎన్డీఏ ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మాజీ రాష్ట్ర పతి రామ్ నాధ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేసి అధ్యయనం చేయించింది. ఆ కమిటీ సిఫారసులకు అనుగుణంగా జమిలీ ఎన్నికల బిల్లును తయారు చేసింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదింపజేసుకునేందుకు సిద్దమయింది. ఇవాళ పార్లమెంట్ ముందుకు ఈ బిల్లును తీసుకురానుంది ప్రభుత్వం. 

వారం రోజుల నుంచి జమిలీ ఎన్నికలపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇదిగో బిల్లు రెడీ అన్నారు. అంతలోనే లేదులేదు ఈసారికి లేనట్టే అంటూ మరికొన్ని లీకులు ఇచ్చారు. మొత్తానికి ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఈ నెల 20 వ తేదీ వరకు ఈ సమావేశాలు జగరనున్నాయి.  ఆ లోపు జమిలీ ఎన్నికల బిల్లును ఆమోదించుకొని జేపీసీకి పంపించాలని భావిస్తోంది కేంద్రం. 

జమిలీ ఎన్నికల వల్ల లాభాలేంటి ?

పార్లమెంట్ ఎన్నికలతో పాటు, రాష్ట్రాల శాసన సభలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలన్నది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.  దీని వల్ల ఎన్నికల వ్యయం చాలా వరకు తగ్గుతుందన్నది వారి వాదన.   2019 ఎన్నికల వ్యయం దాదాపు 60 వేల కోట్లు ఖర్చు అయిందని అంచనా.  ఒకే సారి పార్లమెంట్‌కు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరిగితే చాలా వరకు ఈ వ్యయాన్ని తగ్గించవచ్చు అని చెబుతున్నారు. 

తరచు ఎన్నికలు దేశంలో ఎక్కడో ఓ చోట జరగడం వల్ల ఎన్నికల కమిషన్ కోడ్‌ను వర్తింపజేస్తుంది. దీని వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. సంక్షేమ పథకాల అమలు కష్టమవుతోంది. ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధి వేగంగా సాగుతుందన్నది కేంద్ర ప్రభుత్వ పెద్దల మాట. 

ప్రజలు వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఓటు హక్కు మాత్రం తమ సొంతూరిలో ఉంటోంది. పదే పదే ఎన్నికల కారణంగా తరచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. దీన్ని నివారించవచ్చు. దీని వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుంది.  దేశ ఆర్థిక వ్యవస్థకు జమిలీ ఎన్నికలు మేలు చేస్తాయన్న వాదన ఉంది. ఉత్పాదక పెరుగుతుందని కేంద్రం చెబుతోంది.

వన్ నేషన్ఎ వన్ ఎలక్షన్‌తో నష్టాలు…
 జమిలీ ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమన్న వాదనలు ఉన్నాయి. ఇవి ప్రాంతీయ పార్టీలకు తీవ్ర నష్టం చేస్తోందని ప్రాంతీయ పార్టీలు  ఈ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంట్‌కు, శాసన సభకు ఒకేసారి ఎన్నికలు జరిగితే జాతీయ అంశాలే ప్రాధాన్యత అంశాలవుతాయి. ఓటరు వాటికే ప్రాధాన్యమిచ్చి జాతీయ పార్టీలకు అనుకూలంగా ఓటు వేస్తారు. ఇది శాసన సభ ఎన్నికల్లోను ప్రాంతీయ పార్టీలకు నష్టం చేస్తూ, జాతీయ పార్టీకి మేలు చేస్తుందన్న చర్చ సాగుతోంది.  ప్రాంతీయ సమస్యలపై మాట్లాడే వారు ఉండని , రాష్ట్రాల సమస్యలు మరుగున పడతాయని, ఇది రాష్ట్రాలకు నష్టమన్న వాదనా ఉంది. 

ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో సమానంగా ఎన్నికల కోసం ప్రచార వ్యయాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది చిన్న పార్టీలకు కష్టమైన వ్యవహారం. వీటితోపాటు అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం కష్టమైన పని అని చెబుతున్నారు.  బ్యాలట్ పద్ధతిలో అయినా, ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాల ద్వారా అయినా ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం కష్టమని, పారదర్శకత లోపించే ప్రమాద ముందని ప్రజాస్వామిక వాదుల ఆరోపణ.  జమిలీ ఎన్నికలు రాజ్యాంగంలో లేవని. ఇలా ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్దమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

జమిలీ ఎన్నికల ఆలోచన నుంచి ఇవాళ్టి వరకు…

2014 లో బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశాన్ని ప్రకటించింది.

2016 లో జమిలీ ఎన్నికలపై నీతి అయోగ్ సమావేశాన్ని నిర్వహించి చర్చకు పెట్టింది.

2017లో రాజకీయ సాంకేతిక అంశాలపై విజయ రాఘవన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు

2018 లో  వన్ ఎలక్షన్ చేపట్టాలంటే అవసరమైన రాజ్యాంగ సవరణలను లా కమిషన్ సూచించింది. అందుకు ఐదు సిఫార్సులు చేసింది.

2020 లో మాజీ రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు. రాజ్యాంగ సవరణలు, న్యాయపరమైన అంశాలు, రాష్ట్రాల అధికారాలపై కమిటీ సిఫారసులు

2022లో అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణలు అవసరం అని ప్రకటించడం జరిగింది.

2024  త్వరలోనే ఈ బిల్లును పార్లమెంట్ సభల్లో ఆమోదింపజేయాలన్న లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు.

Also Read: గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ – సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్

ఉన్న చిక్కుముడులు ఏంటీ?

జమిలీ ఎన్నికలపై ఓ వైపు ప్రతిపక్ష పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు, కొందరు రాజ్యాంగ నిపుణులు, ప్రజాస్వామిక వాదులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్లును ఆమోదింపజేసుకోవాలన్న యోచనలో అడుగులు వేసింది. ఈ బిల్లును ఆమోదింపజేయాలంటే అందుకు వీలుగా రాజ్యాంగంలోని 82‍ ఏ, 83(2 ), 327అధికరణలకు సవరణ చేయాల్సి ఉంది.  లోక్ సభ, రాష్ట్రాల శాసన సభల గడువు కంటే ముందుగానే రద్దు చేసేందుకు పదవీ కాలపరిమితిలో మార్పులు చేయాల్సి ఉంది. వన్ నేషన్ ‍ వన్ ఎలక్షన్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చాలంటే  అందుకు 327 ఆర్టికల్ సవరించాల్సి ఉంది. 

మన దేశంలోని మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్ము కాశ్మీర్ కు శాసన సభలు ఉన్నాయి. ఇందు కోసం ప్రత్యేక చట్ట సవరణ అవసరం. దీని కోసం మరో బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సి ఉంది.  ఇతర స్టేట్స్ కు సంబంధించిన అసెంబ్లీల గడువుతో సమానంగా ఈ మూడు కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీల గడువు ఈ బిల్లు నిర్ణయిస్తుంది. అయితే  ఈ బిల్లుకు ఇంకా క్యాబినెట్ ఆమోద ముద్ర పడలేదు. కేవలం పార్లమెంట్, రాష్ట్రాల శాసన సభలకు ఒకే సారి ఎన్నికలు జరిపే బిల్లును మాత్రమే క్యాబినెట్ ఆమోదించింది. 

రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లో మూడింట రెండు వంతలు మెజార్టీ అవసరం. పార్లమెంట్‌లో బీజేపీతోపాటు వాటి మిత్ర పక్షాలమద్ధతు ఇచ్చినప్పటికీ ఈ బిల్లుకు బీఆర్ఎస్, బీజేడీ, వైసీపీతోపాటు ఇండియా కూటమిలోని మరి కొన్ని పార్టీల మద్ధతు అవసరం.  పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజార్టీ అంటే 361 మంది సభ్యుల మద్ధతు ఈ బిల్లుకు అవసరం. కానీ ఎన్డీఏ బలం 293 మాత్రమే. రాజ్య సభలో అధికార పార్టీకి 122 మంది సభ్యులు ఉన్నారు.  243 సభ్యులున్న రాజ్య సభలో మూడింట రెండు వంతుల మెజార్టీ అంటే 162 మంది మద్ధతు అవసరం. 

ఈక్వేషన్స్‌ ఇలా ఉంటే ఇప్పుడుబిల్లు ప్రవేశపెడుతున్న ఎన్డీఏ మిగతా పార్టీలను ఎలా ఒప్పిస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే తమ పార్టీ ఎంపీలకు మూడు లైన్లతో విప్ జారీ చేసింది. 

Also Read: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం – యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments