Congress leader Rahul Gandhi meets job aspirants: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై యువత, నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. అందుకే నిరుద్యోగ సమస్యను కాంగ్రెస్, బీజేపీలు పదే పదే ప్రస్తావిస్తూ యూత్ ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ క్రమంలో హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న యువతను కలిశారు. వారి సమస్యలు విని రాహుల్ గాంధీ చలించిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ (Congress Government in Telangana) ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అన్నారు.
తెలంగాణ వస్తే తమకు కొలువులు వస్తాయని ఆశించామని, రాష్ట్రం వచ్చి పదేళ్లయినా తమ ఆకాంక్షలు నెరవేరలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేయడం తనను కలిచివేసిందన్నారు రాహుల్ గాంధీ. తెలంగాణ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్ర యువతకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు లేక, కోర్టు కేసులతో, పేపరు లీకులతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారంటూ మండిపడ్డారు. వారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనే యువతకే కొలువులు రాని దుస్థితి నెలకొందన్నారు. అందుకే యువత కలలు సాకారం అయ్యేలా, కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండరును రూపొందించిందన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ వారికి చూపించి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ.
#WATCH | Hyderabad, Telangana: Congress leader Rahul Gandhi meets job aspirants at Ashok Nagar and speaks to them about the problems they have been facing after the Telangana govt cancelled the exam notifications pic.twitter.com/uPqqytXVZo
— ANI (@ANI) November 25, 2023