Homeస్పెషల్ స్టోరీ'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - తనపై కుట్ర పన్నుతున్నారని కేటీఆర్ ఆరోపణ

‘నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు’ – తనపై కుట్ర పన్నుతున్నారని కేటీఆర్ ఆరోపణ


KTR Challenge To CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన అరెస్ట్ కోసం ఉవ్విళ్లూరుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకిశాల ఘటనలో తనను టార్గెట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సుంకిశాల కాంట్రాక్టర్‌పై చర్యలేమి తీసుకున్నారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ ఘటనలో కాంట్రాక్టర్ అయిన మేఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఆ కాంట్రాక్టర్‌ను, ఈస్ట్ ఇండియా కంపెనీని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి తీసే దమ్ముందా అని ప్రశ్నించారు. ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ పెడతారా.? అని సీఎంను నిలదీశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా రేవంత్ రెడ్డి  మేఘా సంస్థకు గులాంగిరీ చేస్తున్నారని విమర్శించారు. 

‘అరెస్టులను ఖండిస్తున్నా’

సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం చేస్తున్న మూసీ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ అరెస్ట్‌లను ఎక్స్ వేదికగా ఆయన ఖండించారు. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతిసారీ తమ పార్టీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు, హౌస్ అరెస్ట్‌ల పేరుతో నిర్బంధానికి గురి చేయడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే తమ నేతల హక్కుని ప్రభుత్వం కాల రాస్తోందన్నారు. ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై, హామీల అమలు వైఫల్యంపై నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. నిర్బంధంలోకి తీసుకున్న తమ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ కేటీఆర్ చేశారు.

Also Read: Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం – ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం – రేవంత్ సంకల్పం

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments