KCR Responds On Telangana Thalli New Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) స్పందించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్య.. ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా.?’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరవ్వాలని.. అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు.
మరిన్ని చూడండి