KTR Call For Diksha Divas On 29th November: తెలంగాణవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 29న ‘దీక్షాదివాస్’ (Diksha Divas) ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్వరాష్ట్ర సాధనలో రాష్ట్ర ప్రజలకు ఇది అత్యంత కీలక ఘట్టంగా నిలుస్తుందని అన్నారు. 2009, నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి ప్రత్యేక రాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని చెప్పారు. ఈ దీక్ష యావత్ భారతదేశ రాజకీయ వ్యవస్థను కదిలించిందని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసిందని పేర్కొన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజలు చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని చెప్పారు. ఈ నెల 29న కరీంనగర్‌లో జరిగే దీక్షా దివస్‌లో కేటీఆర్ పాల్గొననున్నారు.
✳️ ఈనెల 29వ తేదీన కరీంనగర్‌లో జరిగే దీక్ష దివస్ కార్యక్రమంలో పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
🔹 రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
🔹 తెలంగాణ ప్రజల… pic.twitter.com/8nGzqsQ3wE
— BRS Party (@BRSparty) November 21, 2024
మహాధర్నాకు నో పర్మిషన్.. కేటీఆర్ ట్వీట్
మరోవైపు, వికారాబాద్ జిల్లా లగచర్లలో బాధిత రైతులకు సంఘీభావంగా.. మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ గురువారం మహా ధర్నా తలపెట్టింది. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కావాలనుకున్న ఈ నిరసనకు పోలీసులు అనుమతివ్వలేదు. అయితే, మహబూబాబాద్‌లో పోలీసుల లాంగ్ మార్చ్‌పై కేటీఆర్ స్పందించారు. ‘ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు. ఎలాంటి గొడవలు జరగలేదు. మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఎందుకు.?. వార్నింగ్‌లు ఎందుకు.?. అసలు మానుకోటలో ఏం జరుగుతోంది.?. శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది.?. ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల, రాక్షస, నియంత పాలన. ఖబడ్దార్ రేవంత్. ఇది తెలంగాణ. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది.’ అని ట్వీట్ చేశారు.
ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు-మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి?
అక్కడ గొడవలు ఏం జరగలేదు ?-మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు?
అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుంది ?
శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది ?
ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది… pic.twitter.com/nCrAPSi05v
— KTR (@KTRBRS) November 21, 2024
మరోవైపు, మహాధర్నా కోసం బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ధర్నాకు అనుమతి వచ్చినట్లు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ గిరిజన మహా ధర్నా చేసుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం అనుమతిచ్చినట్లు పేర్కొంటున్నారు. అయితే, బీఆర్ఎస్ మహా ధర్నాపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో వికారాబాద్‌లో ఘటన జరిగితే మహబూబాబాద్‌లో మహా ధర్నా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ఇక్కడ చిచ్చు పెడుతోందని మండిపడ్డారు.
Also Read: Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా – మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
మరిన్ని చూడండి