Telangana Government MOU With Pharma Companies: తెలంగాణలో (Telangana) మరికొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఆరు ప్రముఖ ఫార్మా కంపెనీలు (Pharma Companies) రాష్ట్రంలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఎంఎస్ఎన్ లేబొరేటరీ, లారస్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెటిరో ల్యాబ్స్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో ఆయా కంపెనీల ప్రతినిధులు చర్చించారు. ఫార్మా సిటీలో 6 కంపెనీలకు అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
కాలుష్య రహిత యూనిట్ల ఏర్పాటుకు ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కార్యకలాపాల విస్తరణతో పాటు గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
✅సచివాలయంలో వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులతో… pic.twitter.com/6vA6ppG9xZ
— Telangana CMO (@TelanganaCMO) November 22, 2024
ఎంఎస్ఎన్ లేబొరేటరీ ఉత్పత్తి, ఆర్అండ్‌డీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా సంస్థలు ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పనున్నాయి. గ్లాండ్ ఫార్మా ఆర్అండ్‌డీ కేంద్రంతో పాటు.. ఇంజెక్టబుల్, డ్రగ్స్ సబ్ స్టాన్స్ ఉత్పత్తి యూనిట్లను స్థాపించేందుకు సిద్ధమైంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇంజెక్టబుల్, బయో సిమిలర్ల యూనిట్‌ను, హెటిరో ల్యాబ్స్ ఫినిష్డ్ డోస్, ఇంజెక్టబుల్ తయారీ పరిశ్రమను నెలకొల్పనుంది. వీటి ద్వారా దాదాపు 12,490 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది.
మరిన్ని చూడండి