Homeస్పెషల్ స్టోరీతెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ – సీఎం రేవంత్ కీలక ఆదేశాలు


CM Revanth Key Orders On BC Census: తెలంగాణలో బీసీ కులగణనకు (BC Census) ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు సోమవారంలోగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కులగణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని సీఎం స్పష్టం చేశారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కల్పన కోసం రాజకీయంగా వెనుకబడిన వర్గాల జనాభా గణాంకాల సేకరణకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ విజ్ఞప్తిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో కోర్టు ఉత్తర్వుల మేరకు సోమవారంలోగా ప్రభుత్వ తాజా ఆదేశాలతో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు కానుంది.

Also Read: Karimnagar News: ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్ – గంటల తరబడి ఎదురుచూపులు, కరీంనగర్‌లో ప్రయాణికుల ఇబ్బందులు

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments