Homeస్పెషల్ స్టోరీతెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్


Telangana RTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రేవంత్ సర్కారు శుభవార్త తెలిపింది. తెలంగాణ రాష్ట్రరోడ్డురవాణా సంస్థ(TGRTC)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల 3035 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రకటించిన ఖాళీల్లో డ్రైవర్- 2000 పోస్టులు, శ్రామిక్-743 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్)- 114 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్)- 84 పోస్టులు, డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్- 25 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్)- 23 పోస్టులు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-15 పోస్టులు, సెక్షన్ ఆఫీసర్(సివిల్)-11,  మెడికల్ ఆఫీసర్(జనరల్)- 07 పోస్టులు, మెడికల్ ఆఫీసర్(స్పెషలిస్ట్)-07 పోస్టులు ఉన్నాయి. 

త్వరలోనే నోటిఫికేషన్ – మంత్రి పొన్నం
తెలంగాణ ఆర్టీలో 3035 ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనున్నట్టు మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ కూడా వెలువడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని మంత్రి అన్నారు.  మహాలక్ష్మి పథకం అమలుతో బస్సుల్లో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియమకాలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ధన్యవాదాలు తెలియజేశారు.

ఖాళీల వివరాలు ఇలా..
















క్ర.సం పోస్టు పేరు పోస్టుల సంఖ్య
1. డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్   25
2. అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ 15
3. శ్రామిక్  743
4. డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్)  84
5. డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్)  114
6. డ్రైవర్  2000
7. అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)  23
8. సెక్షన్ ఆఫీసర్ (సివిల్)  11
9. అకౌంట్స్ ఆఫీసర్  06
10. మెడికల్ ఆఫీసర్ (జనరల్)  07
11. మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్)  07
  మొత్తం ఖాళీలు 3035

సివిల్స్ ఉచిత శిక్షణ దరఖాస్తుకు జూన్ 3 వరకు అవకాశం
తెలంగాణలోని బీసీ స్టడీ సర్కిల్ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. శిక్షణ కోరేవారు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షలకు మించకూడదు. ప్రవేశ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిచేస్తారు. ఇందులో 100 మందిని ఆన్‌‌లైన్ రాతపరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. మిగతా 50 సీట్లు సివిల్స్‌ ఫ్రిలిమ్స్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు కేటాయిస్తారు.
వివరాల కోసం క్లిక్ చేయండి..

గ్రూప్-2′ ఉద్యోగార్థులకు ఉచితంగా గ్రాండ్‌ టెస్టులు..
గ్రూప్-2 ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఉచిత ఆన్‌లైన్‌ గ్రాండ్‌ టెస్టులు నిర్వహించనుంది. ఇందుకకోసం దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు జులై 5 వరకు గ్రాండ్ టెస్ట్ కోసం దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులుకు జులై నెలలో ప్రతివారంలో రెండు రోజులు గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నారు.
గ్రూప్-2 గ్రాండ్ టెస్ట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి. . .

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments