Pawan Kalyan And Home Minister Anitha Meeting: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), హోంమంత్రి అనిత (Home Minister Anitha) సీఎం కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలపై ఇరువురూ చర్చించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటోన్న చర్యల గురించి పవన్‌కు అనిత వివరించారు. తన కూతురు కన్నీళ్లు చూసే తాను ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశానని పవన్ తెలిపారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని.. ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు అనిత చెప్పారు. తాను కూడా ఫేక్ పోస్ట్ బాధితురాలినేనని అన్నారు. అలాగే, జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం శ్రమించే ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఇరువురు నేతలు చర్చించుకున్నారు.
*రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ గారితో మార్యదపూర్వకంగా సమావేశమవడం జరిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు , హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న… pic.twitter.com/MLGmWGvevr
— Anitha Vangalapudi (@Anitha_TDP) November 7, 2024
Also Read: Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ – వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
మరిన్ని చూడండి