9-11 Style Drone Attack On Russian Buildings In Kazan: అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై అల్ ఖైదా ఉగ్రవాదులు విమానాలను హైజాక్ చేసి దాడి చేసిన వైనాన్ని చూస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది. అప్పటి నుంచి ప్రపంచం మొత్తం ఇలాంటి దాడులు తమపై జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే డ్రోన్లు వచ్చిన తర్వాత ఆ జాగ్రత్తలన్నీ పెద్దగా ఉపయోగపడటం లేదు. తాజాగా ఉక్రెయిన్ ఇలాంటి అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ తో రష్యాపై విరుచుకుపడింది.
ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించి ఏళ్లు గడిచిపోతున్నాయి. కానీ రష్యాకు అలుపు వస్తుంది కానీ ఇంకా యుద్ధం కొనసాగితే తమకు పోయేదేమీ లేదని ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగుతోంది. నాటో దేశాలు కొన్ని ఆయుధాలు ఇస్తూండటంతో వారు ఏ మాత్రం తగ్గడం లేదు. కొత్త కొత్త లక్ష్యాలను టార్గెట్ చేసుకుని ముందుకెళ్తున్నారు. తాజాగా రష్యాలోని అతి పెద్ద సిటీల్లో ఒకటి అయిన కజాన్ పై .. అల్ ఖైదా తరహా ప్లాన్ తో దాడులు చేశారు.
ఎనిమిది డ్రోన్ల వంటి మనుషులు ఉండని ఎనిమిది యుద్ధవిమానాలతో కజాన్ సిటీపై దాడిచేశారు. ఖజాన్ లో చాలా పెద్ద భవనాలు ఉంటాయి. ఇలాంటి భవనాలను టార్గెట్ చేసి దాడులు చేశారు.
మరిన్ని చూడండి