Telanagana TET Exam: తెలంగాణలోని ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహించనున్నట్లు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ జులై 6న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఒక అభ్యర్థి ఎన్నిసార్లు అయినా టెట్ పరీక్ష రాయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే డీఎస్సీ రాసుకునేందుకు మాత్రం.. టెట్‌లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించిన వారికే అవకాశం కల్పించనున్నారు. టెట్ మార్కులను డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వనున్నారు.
సీబీఎస్‌ఈ ఏటా రెండుసార్లు సీటెట్ పరీక్ష నిర్వహిస్తోంది. అదే తరహాలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా టెట్ గడువును జీవితకాలానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఒక్కసారి క్వాలిఫై అయితే, మరోసారి రాయాల్సిన అవసరం లేదు. టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉండటంతో కేవలం ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్ పెంచుకునేందుకు మాత్రమే రాసుకునే వెసులుబాటు కల్పించారు.
మరిన్ని చూడండి