Sanju Samson Sensational Recrod In Durban T20: అంతర్జాతీయ టీ20ల్లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) అరుదైన ఘనత సాధించాడు. శుక్రవారం డర్బన్ మైదానంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో సఫారీలను ఉతికి ఆరేశాడు. సొంత మైదానంలో ఆడినట్లే ఆడి చెలరేగిన అతను 47 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో వీర విహారం చేసి మెరుపు శతకం చేశాడు. దీంతో 2 వరుస టీ20 మ్యాచుల్లో శతకాలు బాదేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కాగా, ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్ బౌలర్లను వణికించి మెరుపు సెంచరీ చేసిన సంజూ.. ఇప్పుడు దక్షిణాఫ్రికా గడ్డపై కూడా సత్తా చాటాడు. పీటర్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది 27 బంతుల్లోనే 50 పరుగులకు చేరువైన అతను.. ఆ తర్వాత కేవలం 20 బంతుల్లోనే 50 పరుగులు కొట్టేశాడు. ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా సంజూ నిలిచాడు. అతని కంటే ముందు గుస్తవ్ మెక్‌కియాన్, రీలే రస్సో (దక్షిణాఫ్రికా), ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్) లు మాత్రమే వరుసగా రెండు టీ20ల్లో మూడంకెల స్కోర్ చేశారు.
భారత్ భారీ స్కోర్
మరోవైపు, సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్ 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సులతో 107 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ 3, మార్కో యాన్సెన్, మహరాజ్ క్రుగర్, ఎంగబా పీటర్ తలో వికెట్ పడగొట్టారు.
Also Read: Viral Video : కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్ బౌలర్
మరిన్ని చూడండి