Homeస్పెషల్ స్టోరీకిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట

కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట


Foods That Prevent Kidney Stones : శరీరంలోని వ్యర్థాలను.. రక్తంలోని మలినాలను బయటకు పంపించడంలో కిడ్నీలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఎలక్ట్రోలైట్స్​ని, సోడియం, పొటాషియం, కాల్షియంను రెగ్యులేట్ చేస్తాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండడంలో కిడ్నీలు ప్రధానంగా హెల్ప్ చేస్తాయి. బీపీని కంట్రోల్ చేసి.. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. హార్మోన్ సమస్యలు రాకుండా చేస్తాయి. కాబట్టి కిడ్నీలు శరీరంలో అతి ముఖ్యమైన అవయవంగా చెప్పొచ్చు. 

వివిధ ఆరోగ్య సమస్యల వల్ల కిడ్నీలు ప్రభావమవుతాయి. డయాబెటిస్, బీపీ వంటి ప్రధానకారణాలు కూడా వీటిలో భాగమే. మరికొందరిలో కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం, స్టోన్స్ రావడం జరుగుతుంటాయి. అయితే ఇలాంటి సమస్యలున్నా.. కిడ్నీల్లో రాళ్లు వంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా.. కొన్ని ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. 

యాపిల్స్

యాపిల్స్​ కిడ్నీలో రాళ్లు రాకుండా హెల్ప్ చేస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి.. రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి. వీటిలో ఫైబర్​ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలోని వ్యర్థాలను, టాక్సిన్లను బయటకి పంపడంలో హెల్ప్ చేస్తాయి. 

వెల్లుల్లి

వంటగదిలో దొరికే వెల్లుల్లి కూడా కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, మరిన్ని వైద్య లక్షణాలు ఇన్​ఫ్లమేషన్​ను తగ్గిస్తాయి. మెటబాలీజంను పెంచి.. కిడ్నీలను క్లెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. 

నిమ్మకాయ

చాలామంది నిమ్మకాయను తమ రొటీన్​లో చేర్చుకుంటారు. దీనివల్ల మొత్తం ఆరోగ్యానికే కాదు.. కిడ్నీల ఆరోగ్యానికి, పనితీరుకు మంచిదంటున్నారు నిపుణులు. నిమ్మకాయలోని విటమిన్ సి శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేస్తుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. 

Also Read : ఆ లక్షణాలు కిడ్నీ సమస్యలకు దారితీస్తాయట.. హెచ్చరిక సంకేతాలు ఇవే అంటోన్న నిపుణులు

పసుపు

పసుపును కూడా రెగ్యులర్​గా తీసుకుంటే మంచిది. వంటల్లో, టీ, కషాయం వంటి వాటిల్లో పసుపును కలిపి తీసుకోవచ్చు. వీటిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు పూర్తి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. ఇమ్యూనిటీతో పాటు.. జీర్ణక్రియను పెంచి.. కిడ్నీలపై ప్రెజర్​ని తగ్గిస్తాయి. అలాగే కిడ్నీల్లో పేరుకుపోయిన మలినాలను ఇవి బయటకు పంపించేస్తాయి. 

పుచ్చకాయ

పుచ్చకాయను ఏ కాలంలోనైనా దొరికేస్తుంది. ఇది కిడ్నీలను హైడ్రేటెడ్​గా ఉంచి క్లెన్స్ చేస్తుంది. దీనిలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలోని ఎసిడిటీని తగ్గించి.. శరీరాన్ని, కిడ్నీలను హైడ్రేటెడ్​గా, హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. 

ఇవే కాకుండా బ్లూబెర్రీలు, క్రాన్​బెర్రీలు కూడా కిడ్నీల ఆరోగ్యానికి బాగా హెల్ప్ చేస్తాయి. వీటిలోని ఆక్సిడేటివ్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఇన్​ఫ్లమేషన్​ను తగ్గించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. యూరినరి ట్రాక్ట్ సమస్యలను కూడా దూరం చేసి.. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాబట్టి ఈ ఫుడ్స్​ని మీరు రెగ్యులర్​గా మీ డైట్​లో చేర్చుకుని, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిని డైట్​లో చేర్చుకునే ముందు కచ్చితంగా వైద్యుల సలహాను తీసుకోవాలి. 

Also Read : ఫ్రూట్స్​తో కూడా బరువు తగ్గొచ్చు తెలుసా? వీటిని రెగ్యులర్​గా తినండి, రిజల్ట్స్ మీరే చూస్తారు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments