Homeస్పెషల్ స్టోరీకారులో కరెన్సీ దగ్ధం - పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేలా ప్లాన్, చివరకు!

కారులో కరెన్సీ దగ్ధం – పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేలా ప్లాన్, చివరకు!


Currency Notes Burnt in the Car Engine in Warangal: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections 2023) నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ నగదు భారీగా పట్టుబడుతోంది. అయితే, పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా కారు ఇంజిన్ లో నగదు తరలించేందుకు యత్నించగా కాలి బూడిదైన ఘటన వరంగల్ (Warangal) – ఖమ్మం (Khammam) జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. కారు బానెట్ కింద నగదును అక్రమంగా తరలిస్తుండగా ఇంజిన్ వేడికి రూ.లక్షలాది కరెన్సీ కాలి బూడిదైంది. వరంగల్ నుంచి వర్ధన్నపేట (Vardannapeta) వైపు వెళ్తున్న కారులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డబ్బు తరలిస్తున్నారు. కారు బొల్లికుంట (Bollikunta) క్రాస్ రోడ్డు వద్దకు రాగానే కారులోంచి అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో ఆందోళనకు గురైన వారు కారు, డబ్బును వదిలేసి పరారయ్యారు. అందులోని డబ్బు దగ్ధం కాగా వెనుకనే మరో కారులో వచ్చిన వ్యక్తి నోట్ల కట్టల సంచిన తన వెంట తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఇందులో తరలిస్తున్న డబ్బు రూ.50 లక్షల వరకూ ఉంటుందని సమాచారం. కాగా, రూ.15 లక్షల విలువైన కరెన్సీ కాలిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

Also Read: Madiga Community: ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియలో కదలిక – కమిటీ ఏర్పాటుకు ప్రధాని మోదీ ఆదేశాలు



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments