Homeస్పెషల్ స్టోరీకాంగ్రెస్‌ వాళ్లే రైతు బంధును ఆపింది- హరీష్‌ సహా బీఆర్‌ఎస్‌ నేతల ఫైర్

కాంగ్రెస్‌ వాళ్లే రైతు బంధును ఆపింది- హరీష్‌ సహా బీఆర్‌ఎస్‌ నేతల ఫైర్


తెలంగాణలో రైతుల ఖాతాల్లో పడాల్సిన రైతు బంధు పథకం నిధులకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఎన్నికల టైంలో రైతుల ఖాతాల్లో నిధులు వేయడం రూల్స్‌కు విరుద్ధమని వచ్చిన ఫిర్యాదు మేరకు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇలా ఈసీకి ఫిర్యాదు చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ ముందంజలో ఉందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఇవాళ రైతుల ఖాతాల్లో పడాల్సిన డబ్బులను పడకుండా చేసింది మాత్రం కాంగ్రెస్ నేతలే అంటున్నారు.  

జహీరాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న హరీష్‌ కాంగ్రెస్ వాళ్లే పని గొట్టుకొని ఫిర్యాదులు చేయించి రైతు బంధును బంద్ చేయించారని విమర్శించారు. రైతు బంధును ఆపేయించిన కాంగ్రెస్‌ వాళ్లను ఓటుతో పోటు పోడవాలని పిలుపునిచ్చారు. రైతు బంధు దుబారా ఖర్చని కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారని ఇప్పుడు ఆ డబ్బులు కూడా రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రిస్క్ వద్దని కారు గుర్తుకు ఓట్లు వేయాలని సూచించారు. 

మూడు రోజుల క్రితం రైతు బంధు నిధుల విడుదలకు ఓకే చెప్పిన ఈసీ సడెన్‌గా ఎందుకు మాట మార్చిందని ప్రశ్నించారు హరీష్‌. దీనికి కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదులే కారణమన్నారు. రైతు బంధు ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్‌ లేదని ఒకేవేళ కాంగ్రెస్‌ గెలిస్తే రైతుబంధు మూసేస్తారని ఆరోపించారు. 

 రైతు బంధు ఎన్ని రోజులు ఆపుతారో చూద్దాం అన్నారు హరీష్‌. డిసెంబర్ 3 వరకు ఆపగలరేమో కానీ ఆ తర్వాత వారి వళ్ల కదాన్నారు. తరువాత వచ్చేది తమ ప్రభుత్వమే అని హరీష్‌ స్పష్టం చేశారు. ఆ తర్వాతే రైతు బంధు పైసలు టింగు టింగుమంటూ పడతాయన్నారు. 



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments