Homeస్పెషల్ స్టోరీఎక్స్‌ట్రా మాస్ - శ్రీ లీలతో డ్యాన్స్ ఇరగదీసిన నితిన్!

ఎక్స్‌ట్రా మాస్ – శ్రీ లీలతో డ్యాన్స్ ఇరగదీసిన నితిన్!


Nithin Mass Dance movies with Sreeleela: నితిన్ మంచి డ్యాన్సర్. మాస్, స్టైలిష్, ఫోక్… ఎటువంటి స్టెప్స్ అయినా వేయగలరు. అయితే… గత నాలుగైదు సినిమాల్లో ఆయనకు అంతగా డ్యాన్స్ అవకాశం రాలేదు. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’లో మాంచి మాస్ బీట్ ఉన్న సాంగ్ కుదరడం, హీరోయిన్ కూడా సూపర్ డ్యాన్సర్ కావడంతో నితిన్ కుమ్మేశారు. 

శ్రీ లీలతో నితిన్ మాస్ స్టెప్స్!
నితిన్ సరసన యంగ్ అండ్ క్రేజీ హీరోయిన్ శ్రీ లీల నటిస్తున్న సినిమా ‘ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మ్యాన్’. డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. లేటెస్టుగా ఇందులోని ‘ఓలే ఓలే పాపాయి…’ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. 

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’కు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలు చూస్తే… డిఫరెంట్ మాస్ సాంగ్ కచ్చితంగా ఒకటి ఉంటుంది. ఆ తరహాలో ‘ఓలే ఓలే పాపాయి’ చేశారు. సాంగ్ ప్రోమో చూస్తే… నితిన్, శ్రీ లీల డ్యాన్స్ హైలైట్ అయ్యేలా ఉంది. మాస్ థియేటర్లలో ఈ పాటకు ఆడియన్స్ కూడా డ్యాన్స్ చేసే అవకాశం ఉంది. ఈ నెల 4న… అంటే సోమవారం ఫుల్ సాంగ్ విడుదల చేయనున్నారు.

Also Readయానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ ‘హై’ ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా – మరి, ఆ తర్వాత?

‘ఎక్స్‌ట్రా’ ట్రైలర్ – ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్!
ప్రముఖ దర్శక రచయిత వక్కంతం వంశీ (Vakkantham Vamsi)  దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో శ్రీ లీల యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) ఓ  ప్రధాన పాత్రలో నటించారు. హీరోగా నితిన్ 32వ చిత్రమిది. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ భాగస్వామ్యంతో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

Also Readదూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ – బావుందా? బాలేదా?

ఆల్రెడీ విడుదలైన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాకు ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ లభించింది. అందులో కామెడీ జనాలకు నచ్చింది. ముఖ్యంగా ‘జీవితం… జీవిత… రెండూ నాకు ఒకటేలే’ అంటూ రాజశేఖర్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ఆల్రెడీ సినిమా నుంచి రెండు పాటలు ‘డేంజర్ పిల్ల…’, ‘బ్రష్ వేస్కో…’ విడుదల చేశారు. ఆ రెండిటికీ ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. ఆల్రెడీ సినిమా టీజర్ విడుదల చేశారు. నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన క్యారెక్టరైజేషన్, మూవీ కాన్సెప్ట్, కామెడీ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Appl

నితిన్, శ్రీ లీల జంటగా… రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సుధేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ, పవిత్రా నరేష్, రవివర్మ, ‘హైపర్’ ఆది, వెంకటేష్ ముమ్ముడి, జగదీష్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జయరాజ్, ఛాయాగ్రహణం: యువరాజ్ .జె – అర్థర్ ఎ. విలన్స్ – సాయి శ్రీరామ్, కూర్పు: ప్రవీణ్ పూడి. 



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments