Unsplash
Hindustan Times
Telugu
కాలేయం అనేక విభిన్న విధులను నిర్వహిస్తుంది. ఈ అవయవం పట్ల ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
Unsplash
శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో లివర్ సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలోని అనేక అవయవాలు సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది.
Unsplash
మనం దినచర్యలో చేసే కొన్ని తప్పులు కాలేయానికి ప్రమాదకరం. ఆయిల్ ఫుడ్స్, ఆల్కహాల్ వంటి హానికరమైన పదార్థాలు కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
Unsplash
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే రెడ్ మీట్, సోడా, శీతల పానీయాలు, ఆల్కహాల్, ఆయిల్ ఫుడ్స్ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అవేకాదు ఈ 3 అలవాట్లను కూడా వదిలించుకోవాలి.
Unsplash
కొంతమందికి పగటి పూట నిద్రించే చెడు అలవాటు ఉంటుంది. 10 నుంచి 20 నిమిషాల పాటు నిద్రపోవడం హానికరం కాదు. కానీ పగటిపూట ఎక్కువగా నిద్రిస్తే కాలేయం దెబ్బతింటుంది.
Unsplash
కొందరికి అర్ధరాత్రి వరకు పని చేయడం, లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం అలవాటు. టీవీ, ఫోన్ చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. దీని వల్ల చాలా ఆలస్యంగా నిద్రపోతే లివర్ ఆరోగ్యానికి మంచిది కాదు.
Unsplash
మన కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కాలేయ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
Unsplash
అతిగా ఆకలిని అవుతోందా? ఇవి తింటే కంట్రోల్లో ఉంటుంది!
Photo: Pexels