Andhra Pradesh News: ఏపీ దేవాదాయ కమిషనర్ సత్యనారాయణను బదిలీ చేయొద్దంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగ రాజన్. సత్యనారాయణ చాలా సమర్ధులైన అధికారి అనీ ఆలయాలకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు కొలిక్కి తీసుకొచ్చారని గుర్తు చేశారు. అందుకే ఆయనను మార్చొద్దు అంటూ ఏపీ సీఎం కు లేఖ రాశారు. టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్ మెంట్‌కు కన్వీనర్ హోదాలో ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. సత్యనారాయణను బదిలీ చేసి ఆయన స్థానంలో తీసుకొస్తున్న అధికారి జూనియర్ అని సర్వీస్ పరంగా చూసినా అది కరెక్ట్ కాదని రంగరాజన్ తన లేఖలో పేర్కొన్నారు.
దేవాదాయ కమిషనర్‌గా రామచంద్ర మెహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రస్తుతం దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఉన్న సత్యనారాయణను బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో రామచంద్ర మోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.
Also Read: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
రామచంద్ర మోహన్ వైసీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులు ఎదుర్కొన్నారు అన్న ప్రచారం ఉంది. అప్పట్లో సింహాచలం ఈవోగా మాన్సస్ ట్రస్ట్ ఈవోగా చాలా కాలం పని చేశారు. దేవాలయ భూములకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వయిరీలు ఎదుర్కొన్న ఆయన కోర్టును ఆశ్రయించడంతో ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం ఆదేశించింది.
ప్రభుత్వం మారిన తర్వాత రామచంద్రమోహన్ దేవాదాయ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది చంద్రబాబు ప్రభుత్వం. అయితే పాత కమిషనర్ సత్యనారాయణను దేవాదాయ శాఖలోనే కొనసాగించాలంటూ తెలంగాణలోని చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు లేఖ రాయడం సంచలనంగా మారింది.
గతంలో చంద్రబాబు, లోకేష్‌పై విమర్శలు చేసిన రంగరాజన్
2018లో అప్పటి టీటీడీ అర్చకులు రమణ దీక్షితులపై చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకు రంగరాజన్ ఆగ్రహం చూపించారు. చంద్రబాబు కొడుకు తప్ప లోకేష్‌కు రాజకీయాల్లో ఏం అర్హత ఉందంటూ విమర్శలు చేస్తూనే అర్చకత్వంలో వంశపారంపర్య విధానం ఉంటుందని రాజకీయాల్లో ఉండదని అనడం అప్పట్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అదే రంగరాజన్ దేవాదాయ కమిషనర్‌గా సత్య నారాయణనే కొనగించాలంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.
Also Read: గ్రామపంచాయతీ క్లస్టర్ వ్యవస్ధలో మార్పులకు పవన్ నిర్ణయం – కీలక సూచనలు చేసిన బీజేపీ
మరిన్ని చూడండి