Homeస్పెషల్ స్టోరీఅల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, ఓయూ జేఏసీ...

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి – ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, ఓయూ జేఏసీ డిమాండ్


OU JAC Attack On Allu Arjun House: హైదరాబాద్‌లోని (Hyderabad) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇంటిని ఓయూ జేఏసీ నాయకులు ముట్టడించారు. ఇంటి గోడలు ఎక్కి రాళ్లు విసిరారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు యత్నించగా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాళ్లు తగిలి ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి.  రేవతి చావుకు అల్లు అర్జునే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. బన్నీ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కొందరు ఇంట్లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. కాగా, నిరసన సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులెవరూ బయట కనిపించలేదు. విద్యార్థి సంఘాల ఆందోళనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బన్నీ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్

Also Read: Minister Komatireddy: ‘అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి’ – సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments