Homeస్పెషల్ స్టోరీఅర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం

అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం


Salary Hike for Priests in Andhra Pradesh | అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో రు.50 వేలు పైబడిన ఆదాయం వున్న దేవాలయాల్లో అర్చకులకు చెల్లించే కనీస వేతనం రు.15,000కు పెంచారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పెంపు వలన లబ్ధిపొందే అర్చకులు 1,683 మంది ఉంటారు. కనీస వేతనం నెలకు రు.15,000 కంటే తక్కువ పొందుతున్న అర్చకులకు కొత్త వేతనం కింద రు. 15,000 చెల్లిస్తే దేవాదాయశాఖకు రు.10 కోట్ల వరకు అదనపు భారం పడుతుంది. ఇందులో కొంత భాగాన్ని సి.జి.ఎఫ్. నుంచి చెల్లిస్తారు. మొత్తం లబ్దిపొందే అర్చకుల సంఖ్య 3,203 అని మంత్రి ఆనం తెలిపారు. దేవదాయశాఖ 1987 (30 సెక్షన్) లోని 70వ సెక్షన్ను అనుసరించి అర్చకులకు చెల్లించే కనీస వేతనాన్ని దేవదాయశాఖ భరిస్తుంది.

ఎన్నికల ప్రణాళికలో బ్రాహ్మణులకు, ఇతర వర్గాలకు, అర్చకులకు, వేద పండితులకు, వేదాధ్యయన విద్యార్థులకు ఇచ్చిన నిరుద్యోగ భృతితో సహా ఎన్నికల ప్రణాళికలోని అన్ని అంశాలను అమలు చేసిన ఏకైక శాఖ దేవాదాయశాఖ మాత్రమేనని దేవదాయశాఖ మంత్రి స్పష్టం చేశారు. దేవాలయాలకు సంబంధించి, అర్చకులకు సంబంధించి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను తమ శాఖ అమలు చేయడంలో ముఖ్యమంత్రి సహకారం మరువలేనిదని, అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మంత్రి రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు దేవదాయశాఖ ధర్మదాయశాఖ మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Also Read: YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం – విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు

Also Read: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ – జగన్ పై సంచలన ఆరోపణలు 

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments