Homeస్పెషల్ స్టోరీఅమ్మా నాన్న క్షమించండి అంటూ ఫోన్ కాల్ - ఎంబీబీఎస్ సీటు రాలేదని రైలు నుంచి...

అమ్మా నాన్న క్షమించండి అంటూ ఫోన్ కాల్ – ఎంబీబీఎస్ సీటు రాలేదని రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య


Medical College Student Suicide In Anantapuram: ఓ యువతి మృతదేహాన్ని రైలు పట్టాలపై గుర్తించిన పోలీసులు ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి చనిపోయిందని అనుకున్నారు. అయితే, ఆమె రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం మృతురాలి తల్లిదండ్రుల వల్ల తెలిసింది. ‘అమ్మా, నాన్నా నన్ను క్షమించండి నేను చనిపోతున్నా’ అంటూ ఆత్మహత్యకు ముందు వారికి ఫోన్ చేసి చెప్పిందని ఆలస్యంగా వెలుగుచూసింది. అనంతపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రాయదుర్గం రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి చనిపోయిందని అనుకున్నారు. విచారించగా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు.

అదే కారణం..

కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన తనూజ అనే యువతి ఎంబీబీఎస్ చేసి వైద్యురాలు కావాలని ఎంతో పట్టుదలతో ఉండేది. చిత్రదుర్గంలోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు కోసం ప్రయత్నించి విఫలమైంది. అంతకు ముందు కూడా రెండుసార్లు సీటు కోసం ప్రయత్నించి విఫలం చెందడంతో దీంతో మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే బెంగుళూరు నుంచి హోస్పేటకు వెళ్తూ మార్గమధ్యలో తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘నన్ను క్షమించండి అమ్మా నాన్నా నేను చనిపోతున్నా’ అని తల్లిదండ్రులతో చెప్పింది. ఈ విషయాన్ని మృతురాలి తల్లిదండ్రులే పోలీసులకు వెల్లడించారు. రాయదుర్గం సమీపంలోకి ట్రైన్ రాగానే రన్నింగ్ ట్రైన్‌లో నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దొరికిన ఆనవాళ్లతో వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 

Also Read: Vizag Drugs Case: వైజాగ్ పోర్టులో డ్రగ్స్ కంటెయినర్ కేసు తూచ్ – అందులో డ్రై ఈస్ట్ మాత్రమే ఉందని నిర్దారించిన సీబీఐ

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments