Homeస్పెషల్ స్టోరీఅమెరికాలోని చికాగోలో కాల్పులు- ఖమ్మం యువకుడు సాయితేజ్ మృతి

అమెరికాలోని చికాగోలో కాల్పులు- ఖమ్మం యువకుడు సాయితేజ్ మృతి


Telangana Student Killed In US:ఆమెరికాలో జరిగిన కాల్పుల్లో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుర్రాడు యూఎస్‌ వెళ్లి కేవలం నాలుగు నెలలు మాత్రమే అయింది. ఇంతలో పెను విషాదం చోటు చేసుకుంది. చికాగోలో జరిగిన దుర్ఘటన గురించి తెలుసుకున్న పేరెంట్స్‌ బోరున విలపిస్తున్నారు. 

ఖమ్మం జిల్లా రామన్న పేట్‌కు చెందిన 26 ఏళ్ల సాయితేజ్‌ నాలుగు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. చికాగోలోని ఓ యూనివర్శిటీలో ఎంఎస్సీ చదువుతున్నాడు. అక్కడే దుండగులు నిన్న జరిపిన కాల్పుల్లో సాయి తేజ్ చనిపోయినట్టు కుటుంబానికి సమాచారం వచ్చింది. 

సాయితేజ్ చనిపోయాడన్న వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బోరున విలపిస్తున్న వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. తమ బిడ్డ మృతదేహం స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈ మరణం సాయితేజ్‌ కుటుంబంలోనే కాకుండా రామన్నపేట్‌ గ్రామంలోనే విషాదఛాయలు నింపింది.  

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments