Vaishnavi Chaitanya: బేబి సినిమాతో యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య అద్భుతమైన పాపులారిటీ సాధించారు. అందం, అభినయంతో మెప్పించారు. ఆ చిత్రంలో వైష్ణవి నటనకు చాలా ప్రశంసలు దక్కాయి. వరుసగా ఆమెకు సినిమా ఆఫర్లు కూడా వస్తూనే ఉన్నాయి. బేబి తర్వాత ఆమె ఆనంద్ దేవకొండతో మరో సినిమా చేస్తున్నారు. కాగా, వైష్ణవి చైతన్య మరో చిత్రానికి కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్‍రాజు అల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న సినిమాలో వైష్ణవి హీరోయిన్‍గా నటించనున్నారు.