Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ సత్తా ఏంటో చాటాయి 39వ వారం టీఆర్పీ రేటింగ్స్. ఒకటి, రెండు కాదు.. ఏకంగా టాప్ 6లో మొత్తం ఈ ఛానెల్ సీరియల్సే ఉన్నాయి. ఇక బ్రహ్మముడి తన ఆధిపత్యాన్ని మరింత కొనసాగిస్తూ.. తాజా రేటింగ్స్ లో మరో లెవల్ కు వెళ్లింది. జీతెలుగు, జెమిని, ఈటీవీ సీరియల్స్ ఎప్పటిలాగే స్టార్ మా కంటే చాలా వెనుకబడి ఉన్నాయి.