Sivakarthikeyan: యానిమల్ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టారు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రంపై ఎన్ని విమర్శలు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం బంపర్ హిట్ అయింది. సందీప్ రెడ్డి గత చిత్రాలు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలపై కూడా అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే, గత డిసెంబర్‌లో రిలీజైన యానిమల్ చిత్రంపై విమర్శల దాడి మరింత ఎక్కువగా జరిగింది. అయితే, విమర్శలపై సందీప్ రెడ్డి వంగా కూడా అదే స్థాయిలో దీటుగా స్పందించారు. పలు ఇంటర్వ్యూల్లో ఆయన చేసిన కామెంట్లు, ఇచ్చిన కౌంటర్లు చాలా వైరల్ అయ్యాయి.