<p>పవన్ కల్యా్ణ్ హరిహర వీర మల్లు గురించి క్రేజీ అప్ డేట్ ని మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ని సెప్టెంబర్ 23 ఉదయం 7 గంటలకి మొదలైనట్లుగా మెగా సూర్యా ప్రొడక్షన్స్ అఫీషియల్ గా ప్రకటించింది. అంతేకాకుండా హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసేశారు. వచ్చే సంవత్సరం అంటే 2025 మార్చి 28న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుందని కూడా అప్ డేట ఇచ్చారు. పవన్ కల్యాణ్ చాలా నెలలుగా రాజకీయాల్లో చాలా బిజీగా అవడం వల్ల ప్రెసెంట్ ఆయన చేస్తున్న సినిమాల షూటింగ్స్ అన్ని మధ్యలోనే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇక వాటిని కంప్లీట్ చేయడంమీద పవన్ కల్యాణ్ ఫోకస్ చేశారు. ఇందుకు హరిహర వీరమల్లు ప్రొడక్షన్ కంపెనీ కూడా ఆయనకు సహకరించింది. ప్రెసెంట్ పవన్ కల్యాణ్ నివాసం ఉంటున్న విజయవాడకు దగ్గర్లోనే హరిహర వీరమల్లు షూటింగ్ కోసం సెట్ వేయించారు. సెప్టెంబర్ 23న పవన్ కల్యాణ్ ఆ సెట్లోనే షూటింగ్‌లో పాల్గొన్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా నెక్ట్ ఇయర్ మార్చి 28న రిలీజ్ అవనుంది. ఇది పవన్ కల్యాణ్ కి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అయితే, ముందు మార్చి 27న ‘ఓజీ’ సినిమా వస్తుందని అందరూ భావించారు. కానీ, వీరమల్లు టీం డేట్ అనౌన్స్ చేయడంతో ఓజీ ఆ డేట్ రావడం లేదని అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, సుజిత్ సినిమా కంటే ముందు హరిహర వీరమల్లు థియేటర్లలోకి రాబోతుందని తాజా అప్ డేట్ ని బట్టి అర్థం అవుతుంది.</p>
Source link