HomeవినోదంNBA గేమ్స్ లో 'గుంటూరు కారం' క్రేజ్ - కుర్చీ మడతపెట్టి పాటకు అమెరికన్స్ డ్యాన్స్

NBA గేమ్స్ లో ‘గుంటూరు కారం’ క్రేజ్ – కుర్చీ మడతపెట్టి పాటకు అమెరికన్స్ డ్యాన్స్


Kurchi Madathapetti Mania Spreading Globally : ఇటీవల కాలంలో మన తెలుగు సినిమాలు, ఆ సినిమాల్లోని పాటలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా పుణ్యమా అని సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ ని రీల్స్ రూపంలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడత పెట్టి సాంగ్’ అమెరికాలో మార్మోగిపోయింది. ఏకంగా నేషనల్ గేమ్స్ మధ్యలో కొంతమంది అమెరికన్స్ ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్ కి మాస్ డ్యాన్స్ తో అదరగొట్టేసారు. దీనికి సంబంధించిన వీడియోని ‘గుంటూరు కారం’ మూవీ టీం తమ ట్విట్టర్ లో షేర్ చేసింది.

‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ కి అమెరికన్స్ మాస్ స్టెప్స్

‘గుంటూరు కారం’ సినిమాలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పటికీ ఈ సాంగ్ ఏదో ఒక ఈవెంట్లో వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ పాట ఏకంగా అమెరికా వరకు చేరింది. ప్రస్తుతం అమెరికా హూస్టన్ లో నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్ జరుగుతున్నాయి. ఈ గేమ్స్ మధ్యలో బ్రేక్ టైం లో కొన్ని ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ ని ఏర్పాటు చేయగా.. ఓ గేమ్ మధ్యలో కొంతమంది అమెరికన్స్ ‘గుంటూరు కారం’ సినిమాలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ కి ఓ రేంజ్ లో స్టెప్పులేసి అదరగొట్టారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ‘గుంటూరు కారం’ మూవీ టీం స్వయంగా ఈ వీడియోని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ షేర్ చేస్తూ ‘నాటు నాటు’ సాంగ్ లాగే ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ కూడా గ్లోబల్ లెవెల్ లో వైరల్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘గుంటూరు కారం’ మూవీ ఫిబ్రవరి 9న నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ చేయబడింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమాని అందుబాటులో తీసుకొచ్చారు. థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ ‘గుంటూరు కారం’ అత్యధిక వ్యూస్ తో  రికార్డ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమా హిందీ, ఇంగ్లీష్ వెర్షన్స్ కి భారీ ఆదరణ లభించింది. హిందీ వెర్షన్ అయితే వరుసగా రెండు వారాల పాటు టాప్-10 నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో నిలిచింది. 

టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే

ఏప్రిల్ 7న ఉగాది పండుగ సందర్భంగా ‘గుంటూరు కారం’ మూవీని టీవీలో టెలికాస్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ భారీ ధరకు దక్కించుకుంది. ఈ క్రమంలోనే పండుగ సమయంలో సినిమాని టెలికాస్ట్ చేస్తే మంచి TRP వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారట. దాని ప్రకారం ఏప్రిల్ 7 ఆదివారం సాయంత్రం 6 గంటలకు గుంటూరు కారం సినిమా జెమినీ టీవీలో టెలికాస్ట్ కాబోతోంది

Also Read : వాళ్లు నన్ను ఏ పని చేసుకోనివ్వడం లేదు, ఇంట్లో గొడవలు కూడా జరుగుతున్నాయి: చిరంజీవి

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments