1980ల బ్యాక్‍డ్రాప్‍లో నా సామిరంగ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు విజయ్ బిన్నీ. ఈ మూవీలో నాగార్జున మాస్ యాక్షన్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను అలరించాయి. పక్కా కమర్షియల్ మూవీగా పండుగకు సూటయ్యేలా ఈ చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున సరసన అషికా రంగనాథ్ హీరోయిన్‍గా నటించారు. యంగ్ హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. నరేశ్‍కు జోడీగా మిర్నా మీనన్, రాజ్‍కు జోడీగా రుక్సాన్ ధిల్లాన్ నటించారు.