HomeవినోదంKeedaa Cola Trailer: ఫన్ అండ్ థ్రిల్లింగ్, ఆకట్టుకుంటున్న ‘కీడా కోలా’ ట్రైలర్‌!

Keedaa Cola Trailer: ఫన్ అండ్ థ్రిల్లింగ్, ఆకట్టుకుంటున్న ‘కీడా కోలా’ ట్రైలర్‌!


తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆయన తెరకెక్కించిన ‘పెళ్లిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’  అనే సినిమాలు ఏ రేంజిలో సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కీడా కోలా’.  వివేక్ సుధాన్షు, శ్రీకృష్ణ నిర్మించిన ఈ సినిమా  నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. చైతన్య రావు,  రాగ్ మయూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ చిత్రంలో, తరుణ్ భాస్కర్ కీలక పాత్రను పోషించాడు. క్రైమ్, కామెడీ జోనర్లో నడిచే ఈ సినిమాలో బ్రహ్మానందం ముఖ్యపాత్రను చేస్తున్నారు.  వివేక్ సాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, రానా సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఆకట్టుకుంటున్న ‘కీడా కోలా’ ట్రైలర్‌

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే, టీజర్ లో సినిమా స్టోరీ మాత్రం రివీల్ చేయలేదు. ‘ఈ నగరానికి ఏమైంది’ తర్వాత సుమారు 5 ఏళ్ల తర్వాత తెరకెక్కుతున్న ఈ సినిమా, అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఓ బొద్దింకను, కోలా క్యాప్‌ను చూపించి కీడా కోలా అంటూ  అలరించే టైటిల్ పెట్టి అందరినీ తెగ ఆకట్టుకున్నాడు తరుణ్ భాస్కర్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ ట్రైలర్ అంతా ఫుల్ ఫన్నీ అండ్ థ్రిల్లర్ గా రూపొందింది.

బొమ్మ చుట్టూ తిరుగుతున్న ‘కీడా కోలా’ కథ

ఓవైపు టురెట్ సిండ్రోమ్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడే ఓ వ్యక్తి కోట్లు విలువ చేసే బొమ్మను నాశనం చేస్తాడు. ఈ అంశం కోర్టు మెట్లు ఎక్కుతుంది. కోర్టులో ఈ కేసుపై వాదన జరుగుతుంది. మరోవైపు తనవల్లే రాజన్న కార్పోరేటర్ అయ్యాడని భావించే జీవన్‌ పొగరు దింపడానికి కార్పోరేటర్‌ ఓ వింత ఫ్లెక్సీ పెట్టిస్తాడు. అది చూసి కోపంతో ఊగిపోయిన  జీవన్‌,  నాయుడు అలీయాస్‌ తరుణ్‌ భాస్కర్‌తో కలిసి రాజన్నను చంపి చేసి కార్పోరేటర్ కావాలని ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో మరో గ్యాంగ్‌ కోట్ల రూపాయల విలువ చేసే బొమ్మను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తంగా ఈ బొమ్మ చుట్టూ తిరిగే ఫన్నీ కథను ఈ ట్రైలర్ లో చూపించారు.

కోలాలో పడిన బొద్దింక కథేంటి?   

ఈ ట్రైలర్ లోనూ సినిమాపై ఓ క్లారిటీ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు  తరుణ్ భాస్కర్. అసలు ఆ బొమ్మ వెనుకున్న కథ ఏంటి? ఆ బొమ్మలో ఏం ఉంది? ఆ బొమ్మ కోసం ఎందుకు కొట్లాడుతున్నారు? అనే ప్రశ్నలకు సినిమాలోనే సమాధానం చెప్పనున్నారు. కోలాలో పడిన బొద్దికం కథ ఏంటి అనే విషయాన్ని కూడా మూవీ చూస్తేనే తెలిసే అవకాశం ఉంది. ఇక వీటన్నిపై క్లారిటీ రావాలంటే మరో రెండు వారాలు వేచి చూడక తప్పదు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా మంచి హిట్ అందుకుంటుందని తరుణ్ భాస్కర్ భావిస్తున్నారు.

Read Also: సెకెండ్ మ్యారేజ్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నానంటే?- అసలు విషయం చెప్పిన రేణు దేశాయ్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments