“కృష్ణగారి జయంతి సందర్భంగా ట్రైలర్ లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా స్పెషల్. యాక్షన్ సినిమా చేయమని కృష్ణ గారు చాలా సార్లు చెబుతుండేవారు. ఈ సినిమా విషయంలో ఆయన చాలా ఆనందపడతారని నమ్ముతున్నాను. ఈ వేడుకు వచ్చి మాకు సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి గారికి, సంపత్ నంది గారికి, దాముగారికి, వేణు గోపాల్ గారికి, పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు” అని సుధీర్ బాబు తెలిపారు.