క్రూ మూవీ గురించి..
క్రూ చిత్రంలో టబు, కరీనా కపూర్, కృతి సనన్ ఎయిర్ హోస్టెస్ పాత్రలో నటించారు. ఈ మూవీలో దిల్జీత్, కపిల్ శర్మ, రాజేశ్ శర్మ, స్వస్థ ఛటర్జీ, కుల్‍భూషణ్ కర్బంద కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు రాజేశ్ ఏ కృష్ణన్ దర్శకత్వం వహించగా.. బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిల్మ్స్ & కమ్యూనికేషన్స్ నెట్‍వర్క్ బ్యానర్లపై ఏక్తా కపూర్, రియా కపూర్, అనిల్ కపూర్, దిగ్విజయ్ పురోహిత్ సంయుక్తంగా నిర్మించారు.