విశ్వంభర సినిమాలో హీరోయిన్లు ఎవరన్నది మేకర్స్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు. త్రిష, మృణాల్ ఠాకూర్‌తో పలువురు స్టార్ హీరోయిన్లు ఈ సినిమాలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశ్వంభర సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. విశ్వంభర మూవీకి చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తోంది.