HomeవినోదంChiranjeevi: 537 పాటలు, 24,000 డ్యాన్స్ మూవ్స్.. గిన్నిస్ ప్రపంచ రికార్డు చిరంజీవి కైవసం.. మోస్ట్...

Chiranjeevi: 537 పాటలు, 24,000 డ్యాన్స్ మూవ్స్.. గిన్నిస్ ప్రపంచ రికార్డు చిరంజీవి కైవసం.. మోస్ట్ ప్రొలిఫిక్ స్టార్‌గా..


24,000 డ్యాన్స్ మూవ్స్

156 సినిమాల్లో 537 పాటల్లో చిరంజీవి 24,000 డ్యాన్స్ మూవ్స్ చేసినట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. భారత సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రొలిఫిక్ నటుడిగా, డ్యాన్సర్‌గా అధికారికంగా ప్రకటించింది. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీకే ఇది గర్వకారణంగా నిలిచింది. చిరూకు సమానంగా దేశంలో కొందరు మంచి నటులు ఉన్నా.. ఆయనలా గ్రేస్‍, స్టైల్‍తో డ్యాన్స్ చేసే వారు లేరనడంలో అతిశయోక్తి లేదు. యాక్టింగ్, ఫైట్స్, డైలాగ్స్, గ్రేస్, స్వాగ్‍తో అదరగొట్టే మెగాస్టార్‌ను అందుకే ఆల్‍రౌండర్‌ అని పరిగణిస్తుంటారు. గత తరంలో ఇండియన్ సినిమాల్లో డ్యాన్స్ తీరునే చిరూ మార్చేశారు. విభిన్న రకాల డ్యాన్సులను పరిచయం చేశారు. ఇప్పటికీ సినిమాల్లో యువ నటులకు ఏ మాత్రం తగ్గని విధంగా చిరూ డ్యాన్స్ అదరగొడుతున్నారు.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments