ప్రేమ, పెళ్లి…విడాకులు…
హనీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీలో చైతన్యరావు, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి బాల రాజశేఖరుని దర్శకత్వం వహించాడు. ప్రేమ, పెళ్లి, విడాకులు అనే అంశాల విషయంలో నేటియువతరం ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయి? శృంగార పరమైన అంశాల విషయంలో ఎదుర్కొనే సమస్యలను బోల్డ్‌గా దర్శకుడు ఈ సినిమాలో చర్చించాడు. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి విడిపోవడం కరెక్ట్ కాదనే సందేశాన్ని దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు.