ఈ వారం బిగ్ బాస్ షోలో వీకెండ్ కి దసరా పండగ కూడా కలిసి రావడంతో కలర్ ఫుల్ గా మొదలైంది. ‘సోగ్గాడే చిన్నినాయన’ పాటతో హౌస్ మేట్స్ నాగార్జునకు వెల్కమ్ పలికారు. అలాగే ‘గుడ్ న్యూస్ తో షోను మొదలు పెడదాం’ అంటూ నాగార్జున నామినేషన్లలో ఉన్న యష్మి గౌడను సేవ్ చేశారు.
ఇన్ఫినిటీ రూమ్ ట్విస్ట్… నబిల్ కోరిక ఏంటంటే?
‘అన్లిమిటెడ్ ట్విస్ట్ లో భాగంగా ఒక సరికొత్త రూమ్ ఓపెన్ అవ్వబోతోందని, ఆ రూమ్ లోకి వెళ్ళే ఛాన్స్ ఒకరికే దక్కుతుందని, అలాగే వాళ్ళ కోరికలు కూడా తీరతాయి’ అంటూ ఇన్ఫినిటీ రూమ్ గురించి చెప్తూ మరో ట్విస్ట్ ఇచ్చారు. ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ లో ఒకరిని సెలెక్ట్ చేసేది రాయల్ క్లాన్ టీం’ అన్నారు. ఎక్కువ మంది కంటెస్టెంట్స్ నబిల్ అఫ్రిది నే సెలెక్ట్ చేశారు. దీంతో నబిల్ ను ఇన్ఫినిటీ రూమ్ కు పంపారు. అందులోకి వెళ్ళాక నబిల్ ప్రతివారం అందరికీ ఈక్వల్ గా, లిమిట్ లెస్ రేషన్ కావాలని అడిగాడు.
లడ్డూ కావాలా నాయనా ?
తరువాత ‘లడ్డూ కావాలా నాయనా ?’ అనే టాస్క్ పెట్టారు. ‘రావణాసురుడు చనిపోయిన రోజు దసరా’ అంటూ అక్కడ మాట్కాలను పెట్టి, గెలిచిన టీం మట్కాను పగల గొట్టొచ్చని చెప్పారు. ఈ టాస్క్ లో ‘ఒక్కరు తింటే ఏడుగురు తిన్పించాలని, అయితే ట్విస్ట్ ప్రకారం లడ్డూను తయారు చేసి తిన్పించాలి’ అని అన్నారు. అందులో ఓజి టీం గెలిచింది. తరువాత ‘పకడో పకడో’ అనే రెండో టాస్క్ పెట్టారు నాగ్. ‘ప్లే చేసే పాటకు సంబంధించి ఉన్న ప్రాపర్టీని గుర్తు పట్టాలి’ అని చెప్పగా, ఈ టాస్క్ లో రాయల్స్ క్లాన్ విన్ అయ్యింది. అనంతరం విష్ణు ప్రియ నామినేషన్ల నుంచి సేవ్ అయ్యింది.
హౌస్ లో బతుకమ్మ సంబరాలు
సింగర్ మంగ్లీ హౌస్ లోకి వెళ్లి బతుకమ్మను తయారు చేసే కంపిటిషన్ పెట్టింది. రాయల్స్ క్లాన్ ఇందులో గెలిచింది. గార్డెన్ ఏరియాలో అందరూ కలిసి బతుకమ్మను ఆడారు. అనంతరం ‘దసరా దోస్తీ’ అనే టాస్క్ ఇచ్చారు. ఒకమ్మాయి, ఒకబ్బాయి.. మొత్తంగా 4 పెయిర్స్ అయ్యారు. ‘విశ్వం’ టీం ప్రమోషన్స్ లో భాగంగా శ్రీనువైట్ల, గోపీచంద్ షోకు రాగా, ఈ టాస్క్ జడ్జిమెంట్ లో నాగ్ ఆ ఇద్దరి హెల్ప్ తీసుకున్నారు. ఇందులో చివరగా రాయల్స్ టీం గెలిచారు. విష్ణు ప్రియ కళామతల్లి ముద్దుబిడ్డ అంటూ ఆమె డ్యాన్స్ ను గోపీచంద్ కు చూపించారు. తరువాత గంగవ్వను నామినేషన్ నుంచి సేవ్ చేయగా, ‘పాటా ఆటా’ టాస్క్ లో రాయల్స్ విన్ అయ్యారు.
ఆర్మ్ రెజ్లింగ్ టాస్క్ లో ఫుల్ ఫన్
చివరగా ఆర్మ్ రెజ్లింగ్ టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ లో మెహబూబ్ – నిఖిల్, గౌతమ్ – పృథ్వీ, రోహిణి – విష్ణు ప్రియ, హరితేజ – ప్రేరణ ఆడారు. చివరగా విష్ణు ప్రియ, అవినాష్ ఆడగా.. మొత్తానికి ఓజీ టీం విన్నర్ గా నిలిచారు. ఈ ఎపిసోడ్ లో జరిగిన మొత్తం టాస్క్ లలో మాత్రం రాయల్స్ విన్ అయ్యారు. అలాగే రాయల్స్ కు స్పెషల్ గా చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు. లాస్ట్ లో మెహబూబ్, సీత నమినేషన్లలో ఉండగా.. కిరాక్ సీత ఎలిమినేట్ అయ్యింది.
వైట్ హార్ట్, బ్లాక్ హార్ట్ ఎవరో తేల్చేసిన సీత
ఎలిమినేట్ అయ్యాక వైట్ హార్ట్, బ్లాక్ హార్ట్ ఎవరెవరో చెప్పాలని నాగ్ అడగ్గా.. విష్ణు ప్రియ, నబిల్, అవినాష్ లకు వైట్ హార్ట్ ఇచ్చింది సీత. నిఖిల్ కు, గౌతమ్, నయని పావనిలకు బ్లాక్ హార్ట్ ఇచ్చింది. ఆమెకు గుడ్ బై చెప్పేముందు తాను గేమ్ ఆడి ఉంటే ఆ బైక్ గెలిచి తన తండ్రికి గిఫ్ట్ గా ఇచ్చేదాన్ని అని సీత అనుకున్న విషయాన్ని బయట పెడుతూ, ఆమె కోసం ఆ బైక్ ను గిఫ్ట్ గా ఇస్తానని మోహబూబ్ మాటిచ్చాడు. ఇక రేపటి నామినేషన్ల రచ్చ మామూలుగా ఉండదు.
స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన హీరోయిన్లు
దసరా ట్రీట్ గా టాస్క్ మధ్య మధ్యలో హీరోయిన్లు డ్యాన్స్ లతో అదరగొట్టారు. ముందుగా అమృత అయ్యర్ స్పెషల్ పర్ఫామెన్స్ ఇచ్చింది. మంగ్లి సాంగ్స్ తో అదరగొట్టింది. ‘విశ్వం’ టీం ప్రమోషన్స్ లో భాగంగా శ్రీనువైట్ల, గోపీచంద్ షోకు వచ్చారు. తరువాత ‘కింగ్’ సినిమా కామెడితో హౌస్ తో పాటు చూసేవాళ్ళ ముఖాల్లో కూడా నవ్వులు విరబూసాయి. డింపుల్ హయతి, చివరగా ఫరియా అబ్దుల్లా డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చింది.
Also Read: మహేష్ దర్శకత్వంలో రామ్ 22వ సినిమా… అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన మైత్రి
మరిన్ని చూడండి