Chiyaan Vikram About Anniyan Hindi Remake: ‘అన్నియన్‘ అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ‘అపరిచితుడు‘ అంటే ఠక్కున గుర్తొస్తుంది. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం 2005లో విడుదలై సంచలన విజయం సాధించింది. మనుషులు చేసే తప్పులు, వాటికి నరకంలో విధించే శిక్షలను ‘అపరిచితుడు‘ భూమి మీదే విధించడం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. వకీలుగా పని చేసే రామానుజం మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ బాధపడుతూ, సందర్భాన్ని బట్టి రెమో, అపరిచితుడుగా మారిపోతాడు. మూడు పాత్రల్లో విక్రమ్ నటన చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. తమిళంలో ‘అన్నియన్‘ పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో ‘అపరిచితుడు‘గా విడుదల చేశారు.
హిందీలో ‘అన్నియన్‘ రీమేక్
సౌత్ లో సంచలన విజయం సాధించిన ‘అన్నియన్’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 2021లోనే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్లు నిర్మాత జయంతిలాల్ గడా వెల్లడించారు. గతంలోనే శంకర్ తో ఈ సినిమాకు సంబంధించి చర్చలు కూడా జరిపారు. అయితే, ‘అన్నియన్‘ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ హిందీ రీమేక్ కు సంబంధించి ఆర్థిక అంశాలపై కోర్టుకెక్కాడు. ఈ నేపథ్యంలో ఆ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు.
‘అన్నియన్‘ రీమేక్, సీక్వెల్ పై విక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తాజాగా ‘తంగలాన్‘ సినిమా ప్రమోషనల్ లో పాల్గొన్న నటుడు విక్రమ్ ‘అన్నియన్‘ హిందీ రీమేక్ తో పాటు సీక్వెల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అన్నియన్‘ రీమేక్ గురించి దర్శకుడు శంకర్ ని అడగడం మంచిదన్నారు. “అన్నియన్‘ రీమేక్ గురించి శంకర్ కే తెలుసు. అతడిని నేనూ ఓ విషయం అడగాలి. నాతో పార్ట్ 2 తీయాల్సి ఉంది” అని నవ్వుతూ చెప్పారు. ఇక హిందీ రీమేక్ గురించి మాట్లాడుతూ… “ఇది చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రం. రణవీర్ సింగ్ ‘అన్నియన్’ను అద్భుతంగా చేస్తాడని భావిస్తున్నాను. నేను అతడి వెర్షన్ ను వీలైనంత త్వరగా చూడాలి అనుకుంటున్నారు. అతడి నటన అంటే నాకూ చాలా ఇష్టం. ఈ సినిమాను అతడు ఎలా చేస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు.
‘తంగలాన్’ గురించి విక్రమ్ కామెంట్స్..
తన కెరీర్ లో ‘తంగలాన్’కు ప్రత్యేక స్థానం ఉంటుందటని విక్రమ్ వెల్లడించారు. “నాకు ఈ సినిమా చాలా ఇష్టం. ఎందుకంటే ఈ సినిమాకు రంజిత్ దర్శకత్వం వహించారు. మేం ఈ సినిమా గురించి చాలా సంవత్సరాలుగా చర్చలు జరిపాం. ఈ సినిమాలో తీసే ప్రతి సన్నివేశం ప్రజల్లో చర్చకు రావాలి అనుకున్నాం. చిత్ర నిర్మాణం సవాల్ తో కూడుకున్న విషయం అని తెలిసినా చేశాం. ఇప్పటికే పా రంజిత్ భావజాలం గురించి ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాతో చర్చ మరింత బలోపేతం అవుతుంది. ఈ సినిమా విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను” అని విక్రమ్ వెల్లడించారు.
Read Also: ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్, జూనియర్ అభిమానులకు పూనకాలే, లాంచింగ్ ఎక్కడో తెలుసా?
మరిన్ని చూడండి