Homeవినోదంహమ్మయ్య.. 'హనుమాన్‌' తెలుగు ఓటీటీ అప్‌డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

హమ్మయ్య.. ‘హనుమాన్‌’ తెలుగు ఓటీటీ అప్‌డేట్‌ వచ్చేసింది – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..


Its Official Hanuman OTT Release Confirmed: ఎట్టకేలకు ఆ అప్‌డేట్‌ వచ్చేసింది. తెలుగు ఆడియన్స్‌, మూవీ లవర్స్‌ నిరీక్షణకు తెరపడింది. ఫైనల్లీ ఈ బ్లాక్‌బస్టర్‌ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫాం ఏదో తెలిసిపోయింది. ఇక త్వరలోనే ఆ విజువల్‌ వండర్‌ ఓటీటీకి రాబోతుంది. తాజాగా సదరు సంస్థ ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్స్‌ ఇచ్చేసింది. ఇంతకి ఏ అది ఏ సినిమా అనుకుంటున్నారా? అదేనంటి ప్రశాంత్‌ వర్మ-తేజ సజ్జల ‘హనుమాన్‌’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వచ్చి రెండు నెలలు కావోస్తుంది. కానీ ఇంకా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ లేదు. అంతేకాదు డిజిటల్‌ ప్లాట్‌ఫాం ఏదో కూడా ఇంకా చెప్పనేలేదు.

అప్పట్లో జీ5.. ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిందని, మార్చి 8న ‘హనుమాన్’ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని.. ఇలా చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా.. అవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయాయి. మరోపక్క హిందీ వెర్షన్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. మార్చి 16 నుంచి హనుమాన్‌ హిందీ వెర్షన్‌ zee5లో స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో తెలుగు వెర్షన్‌ ఎప్పుడా? అని టాలీవుడ్‌ ప్రేక్షకులంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. మరికొందరైతే హనుమాన్‌ తెలుగు వెర్షన్‌ అప్‌డేట్‌ కావాలంటూ మేకర్స్‌పై అసహనం చూపించారు. ఇక హిందీ వెర్షన్‌ స్ట్రీమింగ్‌కు ఇంకా రెండు రోజులు ఉందనగా తెలుగు ఓటీటీ అప్‌డేట్‌ ఇచ్చారు.

Hanuman Telugu OTT Release Confirmed: ‘హనుమాన్‌’ తెలుగు వెర్షన్‌ కూడా జీ5లోనే రానుందట. తాజాగా దీనిపై అధికారక ప్రకటన ఇచ్చింది zee5. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‌, టైంపై ప్రకటన ఇస్తామని పేర్కొంది. దీంతో తెలుగు ఆడియన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఆల్రెడీ హిందీ వెర్షన్‌ స్ట్రీమింగ్‌ కానుంది.. ఇంకా తెలుగు వెర్షన్‌ అప్‌డేట్‌ ఇచ్చారా? రిలీజ్‌ డేట్‌ చెప్పండి రా బాబూ! అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.   ఇంకాలేటు ఏంటంటూ మరికొందరైతే జీ5 సంస్థపై అసహనం చూపిస్తున్నారు. కాగా సంక్రాంతి సందర్భందగా హనుమాన్‌ జనవరి 16న విడుదలైన సంగతి తెలిసిందే.


Also Read: సల్మాన్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు – ఆమిర్‌ మాజీ భార్య కిరణ్‌ రావుపై ఆ కామెంట్‌, తప్పుదిద్దుకున్న హీరో, తప్పుదిద్దుకున్న హీరో

సంక్రాంతి సందర్భంగా నాలుగు పెద్ద సినిమాలు పోటీ పడగా.. వాటిలో హనుమాన్‌ మాత్రమే సూపర్‌ హిట్‌గా నిలిచింది. పాన్‌ ఇండియా వచ్చి అన్ని భాషల్లోనూ సూపర్‌ డూపర్ హిట్‌ అయ్యింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా ఊహించని విజయం సాధించింది. వసూళ్లలోనూ రికార్డు సృష్టించింది. కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా సుమారు రూ. 400 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసింది. ఇక ఇందులో ప్రశాంత్‌ వర్మ పనితీరుపై సాధారణ ఆడియన్స్‌తో పాటు సినీ ప్రముఖులు సైతం కొనియాడారు. తక్కువ బడ్జెట్‌లో అయినా హాలీవుడ్‌ రేంజ్‌లో విజువల్‌ వండర్‌ చూపించాడంటూ అంతా ప్రశంసలు కురిపించారు.  

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments