Suriya 44 Movie Shooting Began: తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ ఉన్నారు. ప్రస్తుతం ‘కంగువ’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న సూర్య ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగరతో ‘సూర్య43’ చేయబోతున్నాడు. ఇప్పటికే సినిమా సంబంధించి చర్చలు, ఒప్పందాలు కూడా అయిపోయాయి. ఈ మూవీ ఇంకా సెట్స్‌పైకి రాకముందే ఇటీవల డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో ‘Suriya 44’మూవీని అనౌన్స్ చేశాడు. సూర్య బర్త్‌డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.
ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నట్టు నిన్న కార్తీక్ సుబ్బరాజు అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకువచ్చారు. ‘లైట్స్! యాక్షన్ కెమెరా’ అంటూ సూర్య సెట్స్ నుంచి వీడియో రిలీజ్ చేశాడు. ఫస్ట్ సీన్‌కి సంబంధించిన వీడియో అనిపిస్తుంది. ఇందులో సూర్య సముద్రం తీరంలో ఉన్న ఓ ఇంటి గోడపై లగేజ్‌తో కూర్చుని కనిపించాడు. ఇందులో సూర్య లుక్ చాలా కొత్తగా ఉంది. చూస్తుంటే ఇది యాక్షన్ సీన్ అని అర్థమైపోతుంది. కాగా ఈ సినిమ షూటింగ్‌ని అండమాన్ దీవుల్లోని పోర్ట్‌బ్లెయిర్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలు పెట్టబోతున్నట్టు ఇటీవల మూవీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే నేడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ చేసింది మూవీ టీం.
ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుందని సమాచారం. అలాగే ఈ చిత్రం కోసం పలువురు స్టార్ టెక్నీషియన్లు వర్క్ చేయబోతున్నారట. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజ్, సూర్య మూవీ అనగానే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక నిన్నే కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నట్టు వెల్లడించారు. పెళ్లి కూతురు గెటప్‌లో ఉన్న పూజ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేసి ఆసక్తి పెంచాడు. ఇక ఈ మూవీ టైటిల్ పోస్టర్‌పై మాత్రం ముందు నుంచి ఆసక్తి నెలకొంది. చీకటిలో చూట్టు మంటలు మధ్య ఒక చెట్టుని చూపిస్తూ దానిపై సూర్య44 వర్కింగ్ టైటిల్ పెట్టి రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాలో తారాగణాన్ని కూడా ఈ చెట్టు చాటు నుంచే పరిచయం చేశాడు. దీంతో మూవీపై క్యూరియాసిటి నెలకొంది. కాగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టోన్ బీచ్ ఫిల్మ్స్, 2డీ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్లపై కార్తీక్ సుబ్బరాజ్, కార్తీకేయన్ సంతానం, కల్యాణ్ సుబ్రమణియం, సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కానీ టైటిల్ పోస్టర్‌లో ‘లవ్.. లాఫర్.. వార్’ అని ఇచ్చిన ట్యాగ్ లైన్ ఆసక్తిని పెంచుతుంది. ఇక ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఉండబోతుందని సినీవర్గాల నుంచి సమాచారం.
మరిన్ని చూడండి