Case Filed On Venu Thottempudi: టాలీవుడ్ సీనియర్ హీరో అయిన తొట్టెంపూడి వేణుపై కేసు నమోదయ్యింది. ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ నిర్వహకులైన కావూరి భాస్కర్ రావుతో పాటు వేణు తదితరులపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు రీత్విక్ ప్రాజెక్ట్స్ యాజమాన్యం. ఈ కేసు గురించి ఇంకా ఎలాంటి వివరాలు బయటికి రాలేదు. దీన్ని బట్టి చూస్తే గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న వేణు.. కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడని అర్థమవుతోంది. ఆ వ్యాపారం వల్లే ప్రస్తుతం సమస్యలు తలెత్తి తనపై కేసు నమోదయ్యింది. అసలు కేసు పెట్టింది ఎవరు? ఎందుకిలా చేశారు? తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
‘స్వయంవరం’తో హీరోగా..
ఒకప్పుడు వేణుకు కామెడీ హీరో అనే గుర్తింపు ఉంది. కమర్షియల్ సినిమాల్లో కూడా తన స్టైల్ కామెడీతో ప్రేక్షకులను అలరించేవాడు వేణు. మెల్లగా ఇండస్ట్రీకి వస్తున్న కొత్త హీరోల తాకిడి ఎక్కువయ్యి, తన ఖాతాలో హిట్లు లేకపోవడంతో వేణుకు హీరోగా అవకాశాలు రావడం కూడా తగ్గిపోయింది. మెల్లగా స్క్రీన్ పై నుండి కనుమరుగు అయిపోయాడు. కానీ కెరీర్ మొదట్లోనే ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాల్లో భాగమయ్యాడు వేణు. 1999లో ‘స్వయంవరం’ అనే సినిమాతో హీరోగా పరిచయమయిన వేణు.. ఒకవైపు కామెడీ చేస్తూనే మరోవైపు బోల్డ్ కథలను ఎంచుకోవడానికి ముందుండేవాడు. నిజాన్ని నవ్వుతూ నిర్భయంగా చెప్పే కథలకు వేణు ఫస్ట్ ఛాయిస్‌గా మారాడు.
కామెడీ కూడా కాపాడలేదు..
బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో టాలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలదొక్కుకోగలిగాడు వేణు. కామెడీ తన బలం అని తెలుసుకున్న తర్వాత ఇతర హీరోలతో మల్టీ స్టారర్లు కూడా చేయడం మొదలుపెట్టాడు. అలా వేణు చేసిన ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అయ్యాయి. ఒకానొక సమయంలో టాలీవుడ్‌లో ఈ హీరో బాగా బిజీ కూడా అయ్యాడు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడు. కానీ మెల్లగా తన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. తన కామెడీ కూడా సినిమాలను నిలబెట్టలేకపోయాయి. దీంతో వేణు పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు.
ఓటీటీ వరల్డ్‌లోకి ఎంటర్..
మళ్లీ దాదాపు తొమ్మేదళ్ల తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు వేణు తొట్టెంపూడి. వేణు కమ్ బ్యాక్‌ను చూసి ప్రేక్షకులు చాలా సంతోషించారు. కానీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రేక్షకులను అస్సలు అలరించకపోయింది. దీంతో వేణు కమ్ బ్యాక్‌ను మేకర్స్ పెద్దగా గుర్తించలేదు. దీంతో ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న ఓటీటీ ప్రపంచంపై కన్నేశాడు వేణు. గతేడాదిలో ఓటీటీ వరల్డ్‌లోకి ఎంటర్ అయ్యారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలయిన ‘అతిథి’ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. మరికొన్ని ఓటీటీ ప్రాజెక్ట్స్‌ను కూడా వేణు లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది.
Also Read: అదే నా జీవితంలో మొదటి కాంట్రవర్సీ, అప్పుడు అడగకుండానే నాగబాబు సపోర్ట్ చేశారు – నవదీప్
మరిన్ని చూడండి