Homeవినోదంసినిమా రికార్డులు సృష్టించాలన్నా నేనే, వాటిని తిరగరాయాలన్నా నేనే: బాలకృష్ణ

సినిమా రికార్డులు సృష్టించాలన్నా నేనే, వాటిని తిరగరాయాలన్నా నేనే: బాలకృష్ణ


Balakrishna Speech At Legend 10 Years Celebration: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ డూపర్ హిట్ మూవీ ‘లెజెండ్’. 2014 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్ల పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. కొన్ని సెంటర్లలో ఈ చిత్రం ఏకంగా 400 రోజులు ఆడి సంచలనం సృష్టించింది. ‘లెజెండ్’ విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 30న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘లెజెండ్’ 10 ఏళ్ల వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొని సందడి చేసింది.

రికార్డులు సృష్టించేది నేనే, తిరగరాసేది నేనే- బాలయ్య

ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ తన సినిమాల గురించి, అవి సృష్టించిన రికార్డుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించాలన్నా నేనే, వాటిని తిరగరాయాలన్నా నేనే అంటూ అభిమానులలో ఉత్సాహాన్ని కల్పించారు. మంచి ఉద్దేశంతో తీసిన సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని చెప్పారు. “మంచి ఉద్దేశంతో తీసిన సినిమాలను ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారు. ఇంకా ఇలాంటి సినిమాలు చేయాలని ప్రోత్సహిత్సారు. తెలుగు సినిమాల ప్రభావం ఇప్పుడు యావత్ భారతానికి పాకింది. సినిమా రికార్డులు నాకు కొత్తకాదు. రికార్డులు సృష్టించాలన్నా నేనే. వాటిని తిరగరాయలన్నా నేనే. నా దర్శకులు, కథ ఎంపిక, సహ నటులు, సాంకేతిక బృందం మీద నాకు మంచి నమ్మకం ఉంది” అని చెప్పుకొచ్చారు.       

సినిమా అంటే బాధ్యత- బాలయ్య

సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, బాధ్యత అని చెప్పారు బాలయ్య. తన సినిమాలతో సమాజంలో చైతన్యం కలిగించాలని భావిస్తానని చెప్పారు. ఆ ఉద్దేశంతోనే కథలను ఎంపిక చేసుకుంటానని వెల్లడించారు. ‘లెజెండ్’ సినిమాలో మహిళలకు సంబంధించి మంచి మెసేజ్ ఉందన్నారు. తాజాగా వచ్చిన ‘భగవంత్ కేసరి’లోనూ మంచి సందేశం ఉందన్నారు. ‘లెజెండ్’ సినిమా కోసం చిత్రబృందం ఎంతో కష్టపడి పని చేసిందన్నారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, సోనాల్ చౌహాన్ అందం, అభినయం, రాధిక ఆప్టే నటన, జగపతి బాబు యాక్టింగ్ అద్భుతం అన్నారు. ‘లెజెండ్’ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీరిలీజ్ కావడం సంతోషంగా ఉంది. ఇన్ని సినిమాలు చేసే అవకాశం కల్పించిన కళామ తల్లికి ధన్యవాదాలు. నా సినిమాలను ఆదరిస్తున్న, విజయాలను చేకూర్చుతున్న అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞలు. మీ అభిమానం ఇలాగే కొనసాగలని కోరుకుంటున్నా” అని బాలయ్య చెప్పుకొచ్చారు.  

Read Also: టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ : టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా ? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే ?

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments