Kalki Producer Request to Audience to Say No Spoilers: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ‘కల్కి 2898 AD’ (Kalki Movie). నేడు (జూన్ 27) ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా థియేటర్లోకి వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. మూవీకి మాత్రం ఆడియన్స్ నుంచి హిట్ టాక్ వినిపిస్తుంది. కల్కితో ప్రభాస్ మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడంటున్నారు ఫ్యాన్స్. ఇదంత బాగానే ఉన్న. సినిమా థియేటర్లో వచ్చిందంటూ పైరసీ రాయుళ్లు తమ చేతివాటం చూపిస్తుంటారు.
సినిమా విడుదలైన 24 గంటల్లోనే మూవీని పైరసీ చేసి ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కల్కి నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఓ పోస్ట్ షేర్ చేసింది. పైరసీ ప్రోత్సహించొద్దంటూ ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు కల్కి కోసం నాగ్ అశ్విన్ అండ్ టీం ఎంత కష్టపడిందో చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ (Vyjayanthi Movies Request to Kalki Audience) పెడుతూ.. “కల్కి మూవీ నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఈ సినిమా నిర్మాణం కోసం నాగ్ అశ్విన్‌తో పాటు చిత్రబ్రందం అంతా చాలా కష్టపడింది. గ్లోబల్ స్థాయిలో కల్కిని తెరకెక్కించేందుకు ఎంతో శ్రమించారు.
Say no to spoilers and piracy…
Together, we can keep the magic alive!#Kalki2898AD pic.twitter.com/CQxg1X0oRZ
— Kalki 2898 AD (@Kalki2898AD) June 26, 2024
క్వాలిటీ విషయంలోనూ ఎక్కడా రాజీ పడలేదు. మూవీ టీం అంత కూడా చెమట, రక్తం ఓడ్చి ఈ సినిమాను మనముందుకు తీసుకువచ్చారు. సినిమాను, క్రాప్ట్, మూవీ మేకింగ్ విషయంలో వారు పెట్టిన ఎఫర్ట్స్‌ని మనం గౌరవిద్దాం. థియేటర్‌కి వచ్చిన ఆడియన్స్ సన్నివేశాలను చిత్రీకరించకండి. మినిట్ మినిట్ మూవీ అప్‌డేట్‌ను లీక్ చేసి పైరసీలకు అవకాశం ఇవ్వోద్దు. అలాగే ఆడియన్స్ ఎక్స్‌పీరియన్స్‌ని స్పాయిల్ చేయొద్దని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం” అంటూ వైజయంతీ మూవీస్ నిర్మాతలు తమ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
కాగా టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మాత అశ్వినీ దత్ ‘కల్కి 2898 AD’ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాకు దాదాపు రూ.500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల భారీ వ్యయంతో సినిమాను తెరకెక్కించినట్టు టాక్. ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలు పోషించారు. ఇక కల్కి ఆడ్వాన్స్ బుకింగ్‌లోనే భారీగా బిజినెస్ చేసింది. ఈ సినిమా ఓవర్సిస్‌లో మంచి రెస్పాన్స్ అందుకుంది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ కల్కి ప్రీసేల్ ఓ రేంజ్‌లో జరిగింది. ఇప్పటి వరకు ఈ మూవీ అక్కడ 3 మిలియన్ డాలర్లు బిజినెస్ చేసినట్టు సమాచారం.
Also Read: ఆ రూమర్స్‌కి చెక్ – ‘గేమ్ ఛేంజర్’ మూవీపై షూటింగ్, రిలీజ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్
మరిన్ని చూడండి