Homeవినోదంసన్నీ డియోల్, గోపీచంద్ మలినేని మూవీ టైటిల్ ఫిక్స్- అగ్రెసివ్ లుక్‌లో ఆకట్టుకుంటున్న ‘జాట్’

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని మూవీ టైటిల్ ఫిక్స్- అగ్రెసివ్ లుక్‌లో ఆకట్టుకుంటున్న ‘జాట్’


Jaat First Look Out: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీ డియోల్ తో కలిసి టాలీవుడ్ దర్శకుడు ఓ సినిమా చేస్తున్నారు. ఇన్ని రోజులు ‘SDGM’ అనే వర్కింగ్ టైటిల్ తో నిర్మాణ పనులు కొనసాగించిన ఈ సినిమాకు తాజాగా టైటిల్ ఖరారు చేశారు. ఈ మాస్ యాక్షన్ మూవీకి ‘జాట్’ అనే పేరు పెట్టారు. సన్నీ డియోల్ బర్త్ డే సందర్భంగా టైటిల్ తో పాటు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. సన్నీ ఇమేజ్ కు తగినట్లుగా ఓ యాక్షన్ సీక్వెన్స్ లో పెద్ద ఫ్యాన్ ను చేతిలో పట్టుకుని అగ్రెసివ్ గా చూస్తూ కనిపించాడు. ఈ లుక్ చూస్తుంటే భారీ యాక్షన్ సీన్లు ఉన్నట్లు అర్థం అవుతోంది. గోపీచంద్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ముందుంటారు. ఈ సినిమాలో కూడా అలాంటి ప్రయత్నమే చేయబోతున్నట్లు అర్థం అవుతోంది. ఇంతకు ముందు సన్నీ డియోల్ ఇలాంటి మాస్ యాక్షన్ సీన్లు చాలా చేశారు. ‘గదర్ 2’ మూవీలోనూ ఫైట్స్ అచ్చం ఇలాగే ఉంటాయి. ఇప్పుడు అదే సీన్ మళ్లీ రిపీట్ కాబోతోతున్నట్లు అర్థం అవుతోంది. ఇంకా చెప్పాలంటే సన్నీ డియోల్ మాస్ యాక్షన్ కు గోపీచంద్ మరింత మసాలా జోడించినట్లు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే తెలిసిపోతుంది.  ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ మూవీతో బాలీవుడ్ లోనూ గోపీచంద్ జెండా పాతడం ఖాయం అంటున్నారు సినీ అభిమానులు.    

ఇవాళ సాయంత్రం మోషన్ పోస్టర్ విడుదల

ఈ సినిమాలో సన్నీ డియోల్ తో పాటు రణదీప్ హుడా, రెజీనా కసాండ్రా, సయామీ ఖేర్, వీనీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ బాధ్యతలను చూసుకుంటున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా, యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా పీటర్ హెయిన్, అన్ల్ అరసు, రామ్ లక్ష్మణ్, వెంకట్‌  పని చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ రోజు 4:05 గంటలకు సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

పాజిటివ్ టాక్ వస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే

సన్నీ డియోల్‌కి నార్త్‌ లో మాంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టే అవకాశం ఉంది. బాలీవుడ్‌ లో స్టార్ హీరోలు రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించేందుకు కష్టపడుతున్న సమయంలో సన్నీ డియోల్ ‘గదర్ 2’మూవీతో బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు. ఇప్పుడు ‘జాట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ హిందీతో పాటు తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఇక గోపీచంద్ రీసెంట్ గా బాలకృష్ణతో  ‘వీర సింహారెడ్డి’ సినిమా చేశారు. ఆ తర్వాత రవితేజతో ఓ సినిమా అనుకున్నా, బడ్జెట్ ఎక్కువ అవుతుందని భావించి వెనక్కి తగ్గారు. ప్రస్తుతం బాలీవుడ్ నటుడితో ‘జాట్’ సినిమా చేస్తున్నారు. గోపీచంద్ బాలీవుడ్ లో చేస్తున్న తొలి సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

Read Also: కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్… మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments