Homeవినోదంసత్యభామ ట్రైలర్‌ వచ్చేసింది - యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టిన కాజల్‌ అగర్వాల్

సత్యభామ ట్రైలర్‌ వచ్చేసింది – యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టిన కాజల్‌ అగర్వాల్


Kajal Aggarwal Satyabhama Trailer Out: క్వీన్‌ ఆఫ్‌ మాసెస్‌ కాజల్‌ అగర్వాల్‌ ‘సత్యభామ’. ట్రైలర్‌ వచ్చేసింది. ఫిమెల్‌ ఫిమేల్ సెంట్రిక్‌ మూవీగా సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ పవర్ఫుల్‌ పోలీసుల ఆఫిసర్‌ పాత్రలో నటిస్తుంది. ఇందులో నవీన్‌ చంద్ర కీ రోల్‌ పోషిస్తున్నాడు. ఈ మూవీ జూన్‌ 7న థియేటర్లోకి రాబోతున్న సందర్భంగా తాజాగా మూవీ టీం ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది. నేడ(మే 24) ఐటీసీ కోహినూర్‌లో ట్రైలర్‌ ఈవెంట్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నందమూరి బాలకృష్ణ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.

తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ మొత్తం యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో ఆసక్తిగా సాగింది. ఈ ట్రైలర్‌లో పోలీసు ఆఫీసర్‌గా కాజల్‌ అగర్వాల్‌ అదరగొట్టింది. ట్రైలర్‌ మొదట్లోనే ఓ హత్య కేసు ఛేదించే విషయంలో విఫలమైన పోలీసులు ఆఫీసర్‌గా కాజల్‌ను సస్పెండ్‌ చేసినట్టు చూపించారు. ఈ సినిమా మొత్తం ఓ అమ్మాయి హత్య కేసు చూట్టు తిరుగుతుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఇక కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కాజల్‌ దగ్గరి బంధువు అనిపిస్తుంది. అయితే రక్షించేందుకు సాల్వ్‌ అవ్వని కేసును ఛేదించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా చూపించారు. ఈ క్రమంలో తన పై ఆఫీసర్‌ అయినా ప్రకాశ్‌ రాజ్‌ ఆమె హెచ్చరించినట్టు ట్రైలర్‌లో చూపించారు.

‘సాల్వ్‌ అవ్వని కేసు దగ్గరే ఆగిపోతే టైం ఆగదు, క్రైం ఆగదు నువ్వు మూవ్‌ అవాల్సిందే’ డైలాగ్‌ ఆసక్తిగా ఉంది. ఇక ఈ కేసులో ఇగ్భాల్‌ అనే వ్యక్తి పరారిలో ఉండటం, అతడి కోసం వేతుకుతూ.. కేసును ఛేదించే క్రమంలో కాజల్‌ పలు సవాళ్లను ఎదుర్కోబోతుందని ట్రైలర్‌ ద్వారా చూపించే ప్రయత్నం చేసింది మూవీ టీం. ఈ క్రమంలో కాజల్‌ యాక్షన్‌ సన్నివేశాల్లోనూ నటించింది. ట్రైలర్‌ అది మనకు శాంపిల్‌ చూపించింది. పోలీసు ఆఫీసర్‌ అయిన ఈ సత్యభామ యాక్షన్‌ సన్నివేశాల్లో ఇరగదీసింది. మొత్తానికి క్రైం, థ్రిల్లర్‌ అంశాలతో విడుదలైన ట్రైలర్‌ ఆద్యాతం ఆసక్తిగా సాగింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ మూవీపై ఆసక్తిని పెంచుతుంది. 

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments