సత్య రోడ్లు ఊడ్చుతుంటే వచ్చిన మీడియా వద్దని సత్య పంపించేస్తుంది..మరోవైపు మహదేవయ్య ఫొటోలకు ఫోజులిస్తాడు. బాపూ నువ్వు కూడా రోడ్లు ఊడ్చు ప్రచారానికి పనికొస్తుందని చెబుతాడు క్రిష్. మహదేవయ్య చీపురు పట్టుకుంటాడు..
మహదేవయ్య తుడుస్తుంటే క్రిష్ వాళ్లు జిందాబాద్ చెబుతారు. సత్య అందరకీ పాంప్లెట్స్ పంచుతుంది. రోడ్డుపై ఉన్న ఆవుపేడ మహదేవయ్యతో ఎత్తిస్తాడు క్రిష్. ఇక మహదేవయ్య బిందెలు పంచుతుంటే అక్కడకు వెళతారు సత్య నందిని. వాళ్లు అక్కడ మాట్లాడుతుంటే బిర్యానీ అనే మాట వినగానే అందరూ పారిపోతారు
జనం అంతా మనవైపే ఉన్నారని బిందెలు, బిర్యానీ పంచుతూ మనవైపు తిప్పుకున్నాం. ఇక సత్య పైసలు పంచకపోతే తనవైపు ఎవరూ ఉండరు అంటాడు. సత్య ఓడితే మన కాలికింద చెప్పులా ఉంటుందంటాడు.
మరోవైపు సత్య, నందిని మాట్లాడుకుంటారు. రేపటి నుంచి మా బాపు విశ్వరూపం బయటపెడదాం అంటుంది. కానీ సత్య ఒప్పుకోదు..
కొన్నాళ్లపాటూ సత్యను ఇంటినుంచి బయటకు పోనివ్వకుండా చేస్తే నా పెనిమిటికి తలనొప్పి ఉండదు అంటుంది భైరవి. మోషన్ ట్యాబ్లెట్స్ కలిపేసి ఇచ్చేద్దాం అని ప్లాన్ చేస్తారు.
సత్య డల్ గా ఉండడం చూసి క్రిష్ ఓ బొమ్మను తీసుకుని…ఓ బుజ్జికన్నా నీ నామినేషన్ ముందే నీ శక్తి గురించి చెప్పాను. ఎంత చెప్పినా వినలేదు. పౌరుషం ఉండాలి , సిగ్గుండాలి అంటూ సెటైర్స్ వేస్తాడు. సత్య ఆవేశంతో ఊగిపోతుంది..నా సత్తా ఏంటో చూపిస్తా అంటూ కోపంగా వెళ్లిపోతుంది
ఉదయాన్నే మహదేవయ్య, రుద్ర ప్రచారానికి బయలుదేరుతుంటే సత్య అక్కడకు వస్తుంది. ఇంతలో భైరవి వచ్చి జ్వరం వచ్చిందని తనను ఒకరు చూసుకోవాలని అంటుంది. నేను ఉంటా అని రేణుక అంటే ఫైర్ అవుతుంది. సత్య నా పక్కనే ఉండాలంటుంది.
నందిని వచ్చి మేం ప్రచారానికి వెళ్లాలి కదా అంటే నేను అత్తయ్యను చూసుకుంటా నువ్వు ప్రచారం చేయి అంటుంది. మరోవైపు క్రిష్ కూడా నేను ఇంట్లనో ఉంటాంటాడు. మహదేవయ్య, రుద్ర వెళ్లిపోతారు..ఏదో ఒకటి చేసి సత్యను ప్రచారానికి పంపాలని ప్లాన్ చేస్తాడు క్రిష్
డాక్టర్ ని పిలుస్తానని క్రిష్ అంటే..వద్దంటుంది భైరవి. నాటకం ఆడుతోందని అందరకీ అర్థమవుతుంది. సత్య మటన్ సూప్ చేసి దగ్గరుండి అత్తకి తాగిస్తుంది. ఇంతలో సత్యకి ఓ కాల్ రావడంతో.. సంధ్యని ఎవరో ఏడిపిస్తున్నారంటూ కంగారుగా చెబుతుంది. భైరవి వెళ్లమంటుంది. క్రిష్ కి కూడా అదే చెబుతుంది…
సత్యభామ జనవరి 25 ఎపిసోడ్ లో… సంధ్య బస్టాప్ లో ఓ ఆకతాయికి బుద్ధి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ విషయంలో హ్యాపీగా ఫీలవుతారు సత్య, నందిని. అదే టైమ్ లో సంజయ్ తో కలసి బైక్ పై వెళ్లడం చూస్తుంది సత్య. కాల్ చేసి సంధ్యను నిలదీస్తుంది…
Published at : 24 Jan 2025 09:12 AM (IST)
టీవీ ఫోటో గ్యాలరీ
మరిన్ని చూడండి