Shruti Haasan Marriage: దక్షిణాది అగ్ర కథనాయికల్లో శృతి హాసన్ ఒకరు. విశ్వనటుడు కమల్ హాసన్ కూతురుగా చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అందాల భామ.. హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో శృతి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె ప్రేమాయణం, డేటింగ్, పెళ్లి గురించిన ఎన్నో రూమర్స్ నెట్టింట హల్ చల్ చేశాయి. వీటిపై సలార్ బ్యూటీ ఇప్పటికే పలు సందర్భాల్లో క్లారిటీ ఇవ్వగా.. తాజాగా మరోసారి తన వివాహంపై స్పందించింది.
శృతి హాసన్ ఇటీవల తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కానగరాజ్ తో కలిసి ఓ వీడియో సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. లవ్, రొమాన్స్, పెళ్లి అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో రొమాంటిక్ సీన్స్‌లో లోకేష్, శ్రుతి రెచ్చిపోయి నటించడం హాట్ టాపిక్ అయింది. ఈ మ్యూజిక్ వీడియో గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లోనే శృతి హాసన్ మ్యారేజ్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
మీరు ఎప్పుడు పెళ్ళి చేసుకోబోతున్నారని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. ఏమో తెలియదు సార్ అని శృతి హాసన్ బదులిచ్చింది. నిజానికి శృతికి ఆల్రెడీ పెళ్ళి జరిగిపోయిందని ఆ మధ్య పుకార్లు పుట్టుకొచ్చాయి. తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాను ఆమె సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఓర్హాన్ అవత్రమణి ఓ ఇంటర్వ్యూలో శాంతనును శృతి భర్తగా ప్రస్తావించడంతో ఈ రూమర్స్ ఊపందుకున్నాయి.
Also Read: ‘ఫ్యామిలీ స్టార్’ కు పోటీగా ‘మంజుమ్మల్ బాయ్స్’
ఈ నేపథ్యంలో శృతి హాసన్ సోషల్ మీడియా వేదికగా పెళ్ళి వార్తలపై క్లారిటీ ఇచ్చింది. వాటిల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పింది. తన గురించి తెలియని వాళ్లు కాస్త నోరు మూసుకొని ఉంటే మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించింది. “నేను పెళ్లి చేసుకోలేదు. ప్రతి విషయంలోనూ ఓపెన్ గా ఉండే నేను నా పెళ్లి విషయం ఎందుకు దాచి పెడతాను? కాబట్టి నా గురించి తెలియని వాళ్లు కాస్త నోరు మూసుకుంటే మంచిది” అని శృతి పోస్ట్ పెట్టింది.
వాస్తవానికి శృతి హాసన్ గతంలో లండన్ కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సేల్ తో డేటింగ్ చేసినట్లు కథనాలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల 2019లో వీరిద్దరూ విడిపోయిన తర్వాత శాంతను హజారికాతో శ్రుతి రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నట్లుగా చెప్పుకుంటారు. తరచుగా తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో వీరి ప్రేమాయణంపై అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.
ఓసారి శృతి హాసన్ తన ఇన్స్టా చిట్ చాట్ లో హజారిక గురించి ఓపెన్ అయింది. శాంతను తనకు 2018లోనే తెలుసని.. కానీ తాము 2020లో కలుసుకున్నామని తెలిపింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలపై మాట్లాడుతూ.. తన దగ్గర ఎలాంటి రహస్యాలు లేవని, పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే మరుక్షణమే ఆ విషయం అందరికీ చెప్పేస్తానని చెప్పింది. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు లేవని పేర్కొంది. ఇప్పుడు తాజాగా పెళ్ళి ప్రస్తావన రాగా, ఎప్పుడు చేసుకుంటానో తెలియదని స్పష్టం చేసింది.
Also Read: ఖరీదైన బంగ్లాలు, లగ్జరీ కార్లు – రామ్ చరణ్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?
మరిన్ని చూడండి