Homeవినోదంశృతితో లోకేశ్ రొమాన్స్, చివరిలో చిన్న ట్విస్ట్ - ‘ఇనిమేల్’ ఫుల్ సాంగ్ వచ్చేసింది, చూశారా?

శృతితో లోకేశ్ రొమాన్స్, చివరిలో చిన్న ట్విస్ట్ – ‘ఇనిమేల్’ ఫుల్ సాంగ్ వచ్చేసింది, చూశారా?


Inimel Song Out Now: కోలీవుడ్‌లో కమర్షియల్ యంగ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనకరాజ్.. మొదటిసారి ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నాడు అని తెలియగానే ఫ్యాన్స్ అంతా ముందుగా షాక్ అయ్యారు. అందులోనూ తన శృతి హాసన్‌తో జోడీకడుతూ ఒక మ్యూజిక్ వీడియోలో నటిస్తున్నాడని తెలిసి, అది ఎలా ఉంటుందో చూడడానికి అందరూ ఎదురుచూశారు. కానీ అందరూ ఊహించిన దానికంటే ‘ఇనిమేల్’ మ్యూజిక్ వీడియో చాలా భిన్నంగా ఉంటుందని టీజర్ చూడగానే అర్థమయిపోయింది. ఆఫ్ స్క్రీన్ డైరెక్టర్‌గా ఎప్పుడూ గన్స్, యాక్షన్ మాత్రమే చూపించే లోకేశ్.. ఆన్ స్క్రీన్ యాక్టర్‌గా తనలోని రొమాన్స్‌ను బయటపెట్టాడు. తాజాగా ‘ఇనిమేల్’ మ్యూజిక్ వీడియో విడుదలయ్యింది.

కెమిస్ట్రీకి ఫిదా..

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శృతి హాసన్. అందుకే తన మ్యూజిక్ వీడియో అయిన ‘ఇనిమేల్’ కోసం స్వయంగా లిరిక్స్ రాశారు. అంతే కాదు పాట చివర్లో తన గాత్రాన్ని కూడా వినిపించారు. కమల్ హాసన్ ఈ పాటను రాయగా.. శృతి హాసన్.. దీనికొక కాన్సెప్ట్‌ను క్రియేట్ చేసింది. కమల్ లిరిసిస్ట్‌గా మాత్రమే కాకుండా పాటను నిర్మించి ప్రెజెంట్ చేశారు కూడా. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ‘ఇనిమేల్’ పాట తెరకెక్కింది. అయితే ఇప్పటికే ఈ పాటను చూసిన వారంతా ఈ కాన్సెప్ట్‌తో ఒక సినిమానే తెరకెక్కించవచ్చు అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ‘ఇనిమేల్’ టీజర్‌లో తమ కెమిస్ట్రీతో ఆకట్టుకున్న లోకేశ్, శృతి.. పూర్తి పాటలో ప్రేక్షకులను పూర్తిగా ఫిదా చేశారు. సాంగ్ చివరిలో ట్విస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా చూసేయండి.

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..

‘ఇనిమేల్’లో కూడా లోకేశ్ కనకరాజ్ డైరెక్టర్‌గానే కనిపించాడు. తను ప్రేమించి, పెళ్లి చేసుకున్న అమ్మాయిగా శృతి హాసన్ నటించింది. ధ్వర్కేష్ ప్రభాకర్.. ‘ఇనిమేల్’ను డైరెక్ట్ చేశారు. ఈ ప్రేమపాటకు శృతి హాసనే సంగీతాన్ని అందించి, తానే స్వయంగా పాడింది కూడా. అసలైతే శృతి ముందుగా మ్యూజీషియన్‌గానే తన కెరీర్‌ను మొదలుపెట్టింది. అందుకే అప్పుడప్పుడు తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా పాటలు పాడుతూ, మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంది. అదే విధంగా ‘ఇనిమేల్’తో కూడా అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో శృతి, లోకేశ్ కెమిస్ట్రీకే మంచి మార్కులు పడుతున్నాయి. దర్శకుడిగా లోకేశ్ కనకరాజ్.. ఎప్పుడూ ఇద్దరు ప్రేమికులను కలవనివ్వలేదని కానీ తను మాత్రం హీరోగా శృతితో రొమాన్స్ చేస్తున్నాడని ‘ఇనిమేల్’ టీజర్ విడుదలయినప్పటి నుండి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

తండ్రి ప్రోత్సాహంతో..

ముందుగా ‘ఇనిమేల్’ ఐడియా తనకే వచ్చిందని, వెంటనే ఆ విషయాన్ని తన తండ్రి కమల్ హాసన్‌తో షేర్ చేసుకున్నానని బయటపెట్టింది కమల్ హాసన్. కమల్ కూడా ఈ ఐడియాను ప్రోత్సహించడంతో పాటు లిరిక్స్ రాయడానికి ముందుకొచ్చారని తెలిపింది. విడుదలయిన కాసేపటికే ‘ఇనిమేల్’ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఇక ఈ పాటకు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయి శృతి హాసన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. శృతి బాయ్‌ఫ్రెండ్ షాంతను హజారిక సైతం ‘ఇనిమేల్’ ఇంత పెద్ద హిట్ అయినందుకు శృతికి, లోకేశ్ కనకరాజ్‌కు కంగ్రాట్స్ చెప్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేశాడు.

Also Read: ‘కల్కి 2898 AD’లో నా క్యారెక్టర్ అదే, ఇండియన్ 2 మాత్రమే 3 కూడా పూర్తయ్యింది – కమల్ హాసన్

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments