Homeవినోదంవైల్డ్ కార్డు ఎంట్రీల గురించి ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున... జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు

వైల్డ్ కార్డు ఎంట్రీల గురించి ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున… జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు


‘బిగ్ బాస్ సీజన్ 8’ ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. అందరూ అనుకున్నట్టుగా సోనియా ఆకుల హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఆమె రీ ఎంట్రీ ఉంటుందా? వైల్డ్ కార్డు ఏంటి ద్వారా ఎంత మంది, ఎప్పుడు హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు? బిగ్ బాస్ పెట్టబోయే టాస్క్ లలో హౌస్ మేట్స్ ఎన్ని టాస్క్ లు ఆడతారు? అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగార్జున వీడియో ద్వారా వైల్డ్ కార్డు ఎంట్రీలపై అప్డేట్ ఇచ్చారు. అలాగే వెనువెంటనే ప్రోమో లను రిలీజ్ చేసి, బిగ్ బాస్ ఈ షోపై ఆసక్తిని పెంచేస్తున్నారు. మరి హౌస్ లో వైల్డ్ కార్డుల ఎంట్రీ ఎప్పుడు జరగబోతోంది? తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ఏముంది? అనే విషయాలను చూసేద్దాం పదండి.

బిగ్ బాస్ మిడ్ వీక్ ట్విస్ట్
నాలుగవ వారం నామినేషన్లలో భాగంగా సోనియాను హౌస్ నుంచి బయటకు పంపేసిన నాగార్జున ఆ తర్వాత ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని బాంబు పేల్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక తాజాగా వైల్డ్ కార్డు ఎంట్రీ గురించి అప్డేట్ ఇచ్చి మరోసారి బిగ్ బాస్ షో లవర్స్ ఉలిక్కి పడేలా చేశారు నాగ్. ఊహించని విధంగా తాజా ప్రోమోలో వైల్డ్ కార్డు ఎంట్రీ గురించి ప్రస్తావించారు. ఈ ప్రోమోలో నాగార్జున మాట్లాడుతూ ‘ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతోంది. ఆడియన్స్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8 ఆన్ సండే.. గుర్తుంది కదా? ఎంటర్టైన్మెంట్ కి లిమిట్ లేదు’ అంటూ నాగర్జున చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా, ఆ ప్రోమోను బట్టి చూస్తుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఈ రానున్న ఆదివారం హౌస్ లోకి అడుగు పెట్టే ఛాన్స్ ఉందనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. మిడ్ వీక్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేసి, వచ్చే ఆదివారం వైల్డ్ కార్డ్స్ ను రంగంలోకి దింపబోతున్నారనే విషయం అర్థమవుతుంది. 


 

Read Also : డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ? బిగ్ బాస్ హౌస్ లో ఐదో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీరే 

జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు 
ఇక వెంటనే బిగ్ బాస్ నిర్వాహకులు మరో ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ‘జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు’ అనే టాస్కును పెట్టారు. ఇక ఈ ఈ టాస్క్ లో ఎవరు పాల్గొనాలి ? అనే విషయం మీద కాంతారా క్లాన్ లో సీరియస్ డిస్కషన్ నడిచింది. ముందుగా నైనిక మాట్లాడుతూ ‘మేము నలుగురం నామినేషన్స్ లో ఉన్నాం కాబట్టి మాకు ఛాన్స్ ఇవ్వండి’ అని రిక్వెస్ట్ చేసింది.  ప్రేరణకు హెల్త్ బాలేదని, సీత చీఫ్ కాబట్టి సేఫ్ అని, చివరికి మణికంఠను ఈ టాస్క్ లో నిలబెట్టారు. మరోవైపు యష్మి గౌడ టాస్క్ లో పాల్గొన్నట్టుగా చూపించారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు విన్ అయ్యారు? వాళ్లకు ఈ టాస్క్ ఏదైనా ఇమ్యూనిటీని ఇచ్చిందా?  అనేది నేటి ఎపిసోడ్లో చూడాల్సిందే.

Read Also : NTR 31: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్… ‘దేవర’ను మించి స్టోరీ – ‘డ్రాగన్’ కథ ఇదేనా?

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments