విజయ దశమి సందర్భంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ రోజు పలు చిత్రాలు విడుదల అయ్యాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గోపీచంద్ ‘విశ్వం’, ఆలియా భట్ ‘జిగ్రా’. ఈ సినిమాలు ఎలా ఉన్నాయి? ఈ రోజు విడుదలైన నిఖిల్ కొత్త సినిమా టీజర్ ఎలా ఉంది? ఇండిగో ఎయిర్ లైన్స్ మీద నిన్ను శృతిహాసన్ ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా కబురు ఏంటి?
శ్రీను వైట్లకు విజయం వచ్చిందా? గోపీచంద్ విశ్వం ఎలా ఉంది?
గోపీచంద్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘విశ్’వం సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. వరుస పరాజయాలతో ఆరేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న శ్రీను వైట్ల, ఇటీవల సరైన విజయాలు లేని గోపీచంద్ కలిసి ఎటువంటి సినిమా తీశారు? అనేది రివ్యూలో చూడండి
(విశ్వం రివ్యూ చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
యాక్షన్ బాట పట్టిన ఆలియా భట్… జిగ్రా బాగుందా?
త్రిబుల్ ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ భామ ఆలియా భట్. హిందీలోనూ ఆవిడ పర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్లు చేశారు. ఫస్ట్ టైం అలియా భట్ యాక్షన్ రోల్ చేసిన సినిమా ‘జిగ్రా’. విజయ దశమి సందర్భంగా ఈ రోజు హిందీ తో పాటు తెలుగులోని విడుదల అయింది. ఈ సినిమా బాగుందా లేదా రివ్యూ చదివి తెలుసుకోండి.
(ఆలియా భట్ జిగ్రా రివ్యూ చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
సిద్దు జొన్నలగడ్డ హీరోగా మైథలాజికల్ డ్రామా!
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి ఓ భారీ మైథలాజికల్ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కే ఆ సినిమాలో సిద్ధూ మహారాజా పాత్రలో కనిపిస్తారని సమాచారం. (ఆ సినిమా కోసం వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అంటూ టీజర్‌తో వచ్చిన నిఖిల్!
యువ కథానాయకుడు నిఖిల్, దర్శకుడు సుధీర్ వర్మలది సూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన తొలి సినిమా ‘స్వామి రారా’కు తెలుగు నాట చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన ‘కేశవ’ కూడా కొంత మందిని ఆకట్టుకుంది. కొంత విరామం తర్వాత నిఖిల్, సుధీర్ వర్మ కలిపి చేసిన సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా చేశారు. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూడండి.
(అప్పుడో ఇప్పుడో ఎప్పుడో టీజర్ చూడటంతో పాటు రిలీజ్ డేట్ తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
ముంబై ఎయిర్ పోర్టులో నాలుగు గంటలు నరకయాతన
ముంబై నుంచి తాను ప్రయాణించాల్సిన విమానం నాలుగు గంటలు ఆలస్యం కావడం పట్ల హీరోయిన్ శృతి హాసన్ సీరియస్ అయ్యింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఎయిర్ పోర్టులో ప్రయాణీకులను పడిగాపులు కాసేలా చేశారంటూ మండి పడింది. శృతి హాసన్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ పట్ల ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ స్పందించింది.
(శృతి హాసన్ ఏం ట్వీట్ చేశారు? ఇండిగో ఎయిర్ లైన్స్ ఏం చెప్పింది? అనేది తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
మరిన్ని చూడండి